(॥పల్లవి॥)
నే నంతదాననా ఇంత నీవేకాక
తానకపు ననుపులే తగులమి రేఁచును
(॥నేనం॥)
నేరిచిన నేరకున్న నీకా బాఁతి నేను
ఆరితేరినట్టి నీయిల్లాలఁ గనక
యీరీతి నెంత మెచ్చేవు యిచ్చకురాలనంటా
సారపుమోహములన్నీఁ జవులు వుట్టించును
(॥నేనం॥)
యియ్యకున్న మారుకొన్నఇంకా నీకే బాఁతి నేను
ఇయ్యెడ నీవూడిగపుటింతిఁ గనక
నెయ్యాన నెంతవేఁడుకొనేవుఇతవరినంటా
యెయ్యెడ నీకరుణే ఇంపులు వుట్టించును
(॥నేనం॥)
ఆసపడ్డ వలసిన అట్టె నీకె బాఁతినేను
నేసవెట్టికూడినచెలిఁ గనక
యీసరి శ్రీవేంకటేశ యేలనవ్వే వంటినంటా
బాసతోడినీభోగమే పనికి రప్పించును
(||pallavi||)
ne naṁtadānanā iṁta nīvegāga
tānagabu nanubule tagulami rem̐sunu
(||nenaṁ||)
nerisina neragunna nīgā bām̐ti nenu
āriderinaṭṭi nīyillālam̐ ganaga
yīrīdi nĕṁta mĕchchevu yichchagurālanaṁṭā
sārabumohamulannīm̐ javulu vuṭṭiṁchunu
(||nenaṁ||)
yiyyagunna mārugŏnna̮iṁkā nīge bām̐ti nenu
iyyĕḍa nīvūḍigabuḍiṁtim̐ ganaga
nĕyyāna nĕṁtavem̐ḍugŏnevuidavarinaṁṭā
yĕyyĕḍa nīgaruṇe iṁpulu vuṭṭiṁchunu
(||nenaṁ||)
āsabaḍḍa valasina aṭṭĕ nīgĕ bām̐tinenu
nesavĕṭṭigūḍinasĕlim̐ ganaga
yīsari śhrīveṁkaḍeśha yelanavve vaṁṭinaṁṭā
bāsadoḍinībhogame panigi rappiṁchunu