Ne naduvamtidaananaa nijamaadedaananu

నే నటువంటిదాననా నిజమాడేదానను
Language

(॥పల్లవి॥)
నే నటువంటిదాననా నిజమాడేదానను
తా నెట్టైనా నుండుగాక తలవంచనేఁటికే

(॥నేన॥)
అన్నిటాఁ గొసరితేను అట్టే తనతోనే కాక
కన్నవారితోనెల్లా కారణమేమే
నిన్నటనుండి తన్ను నిందలాడితి ననీని
వన్నేకాఁడేమిసేసినా వట్టి వెరపేఁటికే

(॥నేన॥)
తతి బంతము చూపినా తనవొద్దనేకాక
ఇతరకాంతలవద్ద నేమి గలదే
మితిలేక మాయింట నెమ్మెలు మెరసితిననీ
అతి రాజసపువాని కంత లోఁగనేఁటికే

(॥నేన॥)
కడు వలసినా తనకాఁగిటలోననే కాని
యెడసి తెరలో నుండనేమిటికే
బడి నన్ను శ్రీవేంకటపతి కూడిమెస్తిననీ
యెడవాయకున్నవాఁడు యింతవేసా లేఁటికే

(||pallavi||)
ne naḍuvaṁṭidānanā nijamāḍedānanu
tā nĕṭṭainā nuṁḍugāga talavaṁchanem̐ṭige

(||nena||)
anniḍām̐ gŏsaridenu aṭṭe tanadone kāga
kannavāridonĕllā kāraṇameme
ninnaḍanuṁḍi tannu niṁdalāḍidi nanīni
vannegām̐ḍemisesinā vaṭṭi vĕrabem̐ṭige

(||nena||)
tadi baṁtamu sūbinā tanavŏddanegāga
idaragāṁtalavadda nemi galade
midilega māyiṁṭa nĕmmĕlu mĕrasidinanī
adi rājasabuvāni kaṁta lom̐ganem̐ṭige

(||nena||)
kaḍu valasinā tanagām̐giḍalonane kāni
yĕḍasi tĕralo nuṁḍanemiḍige
baḍi nannu śhrīveṁkaḍabadi kūḍimĕstinanī
yĕḍavāyagunnavām̐ḍu yiṁtavesā lem̐ṭige