Ne merimgina panigi nijamu nerabanela

నే మెరిఁగిన పనికి నిజము నెరపనేల
Language

(॥పల్లవి॥)
నే మెరిఁగిన పనికి నిజము నెరపనేల
భామలను వింతవారి భ్రమయించరాదా

(॥నేమె॥)
మచ్చికల మనసుకు మనసే తారుకాణ
ఇచ్చల నీమోహము నాకేల చెప్పేవు
యెచ్చుకుందు లేమిగల్లా యెరఁగనివానితోనే
పచ్చిగాఁ దెలిపి చెప్పి పచారించరాదా

(॥నేమె॥)
చేసినట్టి చేఁతలెల్లా చేతికిఁ జేయే దిష్టము
యీతల నీసన్న లింకానేల సేసేవు
ఘాతల నీ చెనకులు కడమవారిమీఁదనే
యేతులకు చూపి మోపి యెలయించరాదా

(॥నేమె॥)
కందువయిన కాఁగిటి కాఁగిలే ముయికిముయి
విందువలె నన్నునేల వేఁడుకొనేవు
చెంది కూడితివి నన్ను శ్రీ వేంకటేశ్వర
పొందులు వొద్దివారితో బోదించరాదా

(||pallavi||)
ne mĕrim̐gina panigi nijamu nĕrabanela
bhāmalanu viṁtavāri bhramayiṁcharādā

(||nemĕ||)
machchigala manasugu manase tārugāṇa
ichchala nīmohamu nāgela sĕppevu
yĕchchuguṁdu lemigallā yĕram̐ganivānidone
pachchigām̐ dĕlibi sĕppi pasāriṁcharādā

(||nemĕ||)
sesinaṭṭi sem̐talĕllā sedigim̐ jeye diṣhṭamu
yīdala nīsanna liṁkānela sesevu
ghādala nī sĕnagulu kaḍamavārimīm̐dane
yedulagu sūbi mobi yĕlayiṁcharādā

(||nemĕ||)
kaṁduvayina kām̐giḍi kām̐gile muyigimuyi
viṁduvalĕ nannunela vem̐ḍugŏnevu
sĕṁdi kūḍidivi nannu śhrī veṁkaḍeśhvara
pŏṁdulu vŏddivārido bodiṁcharādā