Ne memta vinnavimchinaa neevu maa maada vinevaa

నే మెంత విన్నవించినా నీవు మా మాట వినేవా
Language

(॥పల్లవి॥)
నే మెంత విన్నవించినా నీవు మా మాట వినేవా
ఆముకొని మమ్ము సుద్దులడిగేవు నీవు

(॥నేమెం॥)
యేకటాన నుండి యాపె యేమనిచెప్పెనో బుద్ది
ఆకుమడిచి ఇచ్చి యేమని నేర్పెనో
ఆకడ బోనము వెట్టుడప్పు డేమి బోదించేనో
మాకుఁ దెలియదు నీమతకములెల్లాను

(॥నేమెం॥)
సింగారపుం దోటలోన చేరి యేబాస గొనెనో
సంగతి గొల్వులో నెట్టు జట్టిగొనెనో
యెంగిలిపొత్తువేళల నేమని భ్రమఇంచెనో
చెంగ నెఱఁగము నీచిత్తములోపనులు

(॥నేమెం॥)
నెలకొన్నరతివేళ విన్నెంత నలపించెనో
అలమేల్ మంగ శ్రీవేంకటాధీశుఁడా
తలఁచుక వచ్చి నేండు తగ మమ్ము నేలితివి
మలసి తోచఁదాయ నీమర్మము లెవ్వరికి

(||pallavi||)
ne mĕṁta vinnaviṁchinā nīvu mā māḍa vinevā
āmugŏni mammu suddulaḍigevu nīvu

(||nemĕṁ||)
yegaḍāna nuṁḍi yābĕ yemanisĕppĕno buddi
āgumaḍisi ichchi yemani nerbĕno
āgaḍa bonamu vĕṭṭuḍappu ḍemi bodiṁcheno
māgum̐ dĕliyadu nīmadagamulĕllānu

(||nemĕṁ||)
siṁgārabuṁ doḍalona seri yebāsa gŏnĕno
saṁgadi gŏlvulo nĕṭṭu jaṭṭigŏnĕno
yĕṁgilibŏttuveḽala nemani bhrama̮iṁchĕno
sĕṁga nĕṟam̐gamu nīsittamulobanulu

(||nemĕṁ||)
nĕlagŏnnaradiveḽa vinnĕṁta nalabiṁchĕno
alamel maṁga śhrīveṁkaḍādhīśhum̐ḍā
talam̐suga vachchi neṁḍu taga mammu nelidivi
malasi tosam̐dāya nīmarmamu lĕvvarigi