Ne memanemu ninnu neegela siggubada

నే మేమనేము నిన్ను నీకేల సిగ్గుపడ
Language

(॥పల్లవి॥)
నే మేమనేము నిన్ను నీకేల సిగ్గుపడ
దీమసాన మీరిద్దరుఁ దెలుపుకోరే

(॥నేమే॥)
చెలపల చెమటలు చెక్కుల పులకలు
వలపుకొలఁదిఁగాక వచ్చీనటే
మలకలమాట లాడి మాతోనేల మొరఁగేవు
అలవాఁడే నీ విభుఁడు అడుకోఁగదే

(॥నేమే॥)
కనుఁగొన చూపులును కడలేనియాసలును
ననుపు కొలఁదిగాక నాటేనటే
మనసుమర్మాలు చెప్పి మమ్మేల నమ్మించేవు
పనివడి మగనికే బాస తీయఁగదవే

(॥నేమే॥)
నయగారి సేఁతలును నవ్వుల సొలపులును
ప్రియము కొలఁదిఁగాక పెరిగీనటే
నియతాన నీవు గూడి నేఁడు నన్నేలించితివి
క్రియ శ్రీవేంకటేశుడే కెరలించవే

(||pallavi||)
ne memanemu ninnu nīgela siggubaḍa
dīmasāna mīriddarum̐ dĕlubugore

(||neme||)
sĕlabala sĕmaḍalu sĕkkula pulagalu
valabugŏlam̐dim̐gāga vachchīnaḍe
malagalamāḍa lāḍi mādonela mŏram̐gevu
alavām̐ḍe nī vibhum̐ḍu aḍugom̐gade

(||neme||)
kanum̐gŏna sūbulunu kaḍaleniyāsalunu
nanubu kŏlam̐digāga nāḍenaḍe
manasumarmālu sĕppi mammela nammiṁchevu
panivaḍi maganige bāsa tīyam̐gadave

(||neme||)
nayagāri sem̐talunu navvula sŏlabulunu
priyamu kŏlam̐dim̐gāga pĕrigīnaḍe
niyadāna nīvu gūḍi nem̐ḍu nanneliṁchidivi
kriya śhrīveṁkaḍeśhuḍe kĕraliṁchave