నవ్వువచ్చీ నిన్నుఁజూచి నాకు నేఁడు । యీ
(॥పల్లవి॥)
నవ్వువచ్చీ నిన్నుఁజూచి నాకు నేఁడు । యీ-
రవ్వలు నీకే చెల్లు రాజసపు దేవుఁడా
(॥నవ్వు॥)
సతికుచములు మోవ సాముచేసినటువలె
సతముగా మోచేవు శంఖచక్రములు
మతకాన వేఁడుకొనేమార్గమున నున్నట్టు
తతి నభయహస్తము తప్పవు నీ విపుడు
(॥నవ్వు॥)
కామిని నలమిపట్టేగతి అలవాటుగా
యెమరవు కటిహస్త మెంతైనా నీవు
నేమమున ఆకెరాక నిక్కిచూచేమతకాన
కోమలపు నీకు నిల్వుఁగొలువులే ఇపుడు
(॥నవ్వు॥)
అంకె నుపరిసురత మలవాటు చెడకుండా
వుంకువ శ్రీసతి మోచే వురమునను
అంకపుశ్రీవేంకటేశ అంది మమ్ముఁగాచేటి -
పొంకమున మన్ననచూపులు చల్లే విదిగో
(||pallavi||)
navvuvachchī ninnum̐jūsi nāgu nem̐ḍu | yī-
ravvalu nīge sĕllu rājasabu devum̐ḍā
(||navvu||)
sadigusamulu mova sāmusesinaḍuvalĕ
sadamugā mosevu śhaṁkhasakramulu
madagāna vem̐ḍugŏnemārgamuna nunnaṭṭu
tadi nabhayahastamu tappavu nī vibuḍu
(||navvu||)
kāmini nalamibaṭṭegadi alavāḍugā
yĕmaravu kaḍihasta mĕṁtainā nīvu
nemamuna āgĕrāga nikkisūsemadagāna
komalabu nīgu nilvum̐gŏluvule ibuḍu
(||navvu||)
aṁkĕ nubarisurada malavāḍu sĕḍaguṁḍā
vuṁkuva śhrīsadi mose vuramunanu
aṁkabuśhrīveṁkaḍeśha aṁdi mammum̐gāseḍi -
pŏṁkamuna mannanasūbulu salle vidigo