నవ్వు వచ్చీ మిమ్ము జూచి నాకు నేఁడు
(॥పల్లవి॥)
నవ్వు వచ్చీ మిమ్ము జూచి నాకు నేఁడు
కువ్వలై వలపు గుది వచ్చినట్లాయను
(॥నవ్వు॥)
పెట్టినపయ్యదకొంగు పెనుచెమటలచేత
గుట్టుతోడనే చెలికి గుబ్బల నంటె
పట్టరానిసిగ్గుతో నీ పచ్చడము గప్పుకొనె
నెట్టుకొన్న రమణుఁడ నీ భాగ్యము లాయెను
(॥నవ్వు॥)
మోవిదొండపండు సతిముంజేతి చిలుకచే
కావరించి తొడుకఁగా గంటి వడెను
వావిరి సిగ్గుతో నీ వదనానఁ జిక్కించె
రేవగలు విభుఁడ కోరిన కోర్కులాయను
(॥నవ్వు॥)
జలజాక్షి నిలువెల్లా జవ్వనమదముచేత
చెలరేఁగి పులకలు చిమ్మేఁగెను
కలిగి సిగ్గుతో నిన్నుఁ గాఁగిలించుకొనె నేఁడు
నెలవై శ్రీవేంకటేశ నీకు వేడుకాయను
(||pallavi||)
navvu vachchī mimmu jūsi nāgu nem̐ḍu
kuvvalai valabu gudi vachchinaṭlāyanu
(||navvu||)
pĕṭṭinabayyadagŏṁgu pĕnusĕmaḍalaseda
guṭṭudoḍane sĕligi gubbala naṁṭĕ
paṭṭarānisiggudo nī pachchaḍamu gappugŏnĕ
nĕṭṭugŏnna ramaṇum̐ḍa nī bhāgyamu lāyĕnu
(||navvu||)
movidŏṁḍabaṁḍu sadimuṁjedi silugase
kāvariṁchi tŏḍugam̐gā gaṁṭi vaḍĕnu
vāviri siggudo nī vadanānam̐ jikkiṁchĕ
revagalu vibhum̐ḍa korina korgulāyanu
(||navvu||)
jalajākṣhi niluvĕllā javvanamadamuseda
sĕlarem̐gi pulagalu simmem̐gĕnu
kaligi siggudo ninnum̐ gām̐giliṁchugŏnĕ nem̐ḍu
nĕlavai śhrīveṁkaḍeśha nīgu veḍugāyanu