నవ్వి నవ్వి జగడాలు నాఁటినేఁటి విగడాలు
(॥పల్లవి॥)
నవ్వి నవ్వి జగడాలు నాఁటినేఁటి విగడాలు
ఇవ్వల నీ పతితోనే యేలమ్మ నీకు
(॥నవ్వి॥)
కడుఁ బెదవి కదలీకదలనిమాటలు
వడిఁ గసరులతోడివాలుఁజూపుతేటలు
పుడుకుఁ జెక్కు చెమట లూరేటివూటలు
యెడలేదు యింతలోనే యేలమ్మ నీకు
(॥నవ్వి॥)
ఆరితేరినపయ్యదమరఁగు మొరఁగులు
నీరుకమ్మే చెక్కుచేతినిండునివ్వెరగులు
ఘోరపుఁగన్నీట మించు గుబ్బలకరఁగులు
యీరీతి వింతలోనే యేలమ్మ నీకు
(॥నవ్వి॥)
వుండనుండ నంతలో నిట్టూరుపుటుసురులు
బండుబండై పులకల పైరులపసురులు
అండనె శ్రీవేంటేశకుఁ డాదరించి కూడె నేఁడు
యెండలెల్లా నీడలాయ యేలమ్మ నీకు
(||pallavi||)
navvi navvi jagaḍālu nām̐ṭinem̐ṭi vigaḍālu
ivvala nī padidone yelamma nīgu
(||navvi||)
kaḍum̐ bĕdavi kadalīgadalanimāḍalu
vaḍim̐ gasaruladoḍivālum̐jūbudeḍalu
puḍugum̐ jĕkku sĕmaḍa lūreḍivūḍalu
yĕḍaledu yiṁtalone yelamma nīgu
(||navvi||)
āriderinabayyadamaram̐gu mŏram̐gulu
nīrugamme sĕkkusediniṁḍunivvĕragulu
ghorabum̐gannīḍa miṁchu gubbalagaram̐gulu
yīrīdi viṁtalone yelamma nīgu
(||navvi||)
vuṁḍanuṁḍa naṁtalo niṭṭūrubuḍusurulu
baṁḍubaṁḍai pulagala pairulabasurulu
aṁḍanĕ śhrīveṁṭeśhagum̐ ḍādariṁchi kūḍĕ nem̐ḍu
yĕṁḍalĕllā nīḍalāya yelamma nīgu