నను నేమి యడిగీనే నంటునఁ దన సుద్దులు
(॥పల్లవి॥)
నను నేమి యడిగీనే నంటునఁ దన సుద్దులు
దినకొత్తలు తనకే తెలుసుఁగాక
(॥నను॥)
మనసులో మఱఁగులు మాకు నెట్టు దెలుసునే
తనువుపచేఁతలు దాఁగవుగాక
పెనగోన్నయాసలు బేదించ నెట్టువచ్చునే
కనుఁగొనేచూపలు కానవచ్చుఁగాక
(॥నను॥)
సెలవులనవ్వులకు చెప్పేయర్థ మేఁటిదే
పలికితే నన్నీ నేరుపరచేఁగాక
వలచినవలపులు వాకుచ్చుట యెటులే
చెలవలచెమటలు చెప్పఁగలగాక
(॥నను॥)
పచ్చిదేరేసిగ్గులు పట్టఁగ వసమౌనటే
యిచ్చట రతులచోప్పులెత్తేఁగాక
అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
కచ్చుపెట్టి నన్నుఁ గూడెఁ గాదనేనటవే
(||pallavi||)
nanu nemi yaḍigīne naṁṭunam̐ dana suddulu
dinagŏttalu tanage tĕlusum̐gāga
(||nanu||)
manasulo maṟam̐gulu māgu nĕṭṭu dĕlusune
tanuvubasem̐talu dām̐gavugāga
pĕnagonnayāsalu bediṁcha nĕṭṭuvachchune
kanum̐gŏnesūbalu kānavachchum̐gāga
(||nanu||)
sĕlavulanavvulagu sĕppeyardha mem̐ṭide
paligide nannī nerubarasem̐gāga
valasinavalabulu vāguchchuḍa yĕḍule
sĕlavalasĕmaḍalu sĕppam̐galagāga
(||nanu||)
pachchideresiggulu paṭṭam̐ga vasamaunaḍe
yichchaḍa radulasoppulĕttem̐gāga
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
kachchubĕṭṭi nannum̐ gūḍĕm̐ gādanenaḍave