Nannum joodave yidamdu namtuna nelinaamdu

నన్నుఁ జూడవే యితఁడు నంటున నేలినాఁడు
Language

(॥పల్లవి॥)
నన్నుఁ జూడవే యితఁడు నంటున నేలినాఁడు
మన్నన యింత లేకుంటే మరి యది వనితా

(॥నన్ను॥)
కందున తనవిభుఁడు కడునెంత మన్నించినా
అందరితో నాడుకొనే దది వనితా
చందముగా నాతఁడు చనవిచ్చి వుండఁగాను
మందలించి కొసరేది మరి యది వనితా

(॥నన్ను॥)
గుటుతోడ నాతఁడు కొంగువట్టి తీసితేను
అట్టె యెమ్మెలఁ బొదలే దది వనితా
జట్టిగొని యాతఁడు సరసము లాడితేను
మట్టుమీద నవ్వేది మరి యది వనితా

(॥నన్ను॥)
గారవించి శ్రీవేంకటేశుఁడు గూడితేను
ఆరీతి నవ్వులు నవ్వే దది వనితా
కూరిమి నాతఁడే చెక్కు గోరికొననొత్తితేను
చేరి మారుకుమారు సేసేది వనితా

(||pallavi||)
nannum̐ jūḍave yidam̐ḍu naṁṭuna nelinām̐ḍu
mannana yiṁta leguṁṭe mari yadi vanidā

(||nannu||)
kaṁduna tanavibhum̐ḍu kaḍunĕṁta manniṁchinā
aṁdarido nāḍugŏne dadi vanidā
saṁdamugā nādam̐ḍu sanavichchi vuṁḍam̐gānu
maṁdaliṁchi kŏsaredi mari yadi vanidā

(||nannu||)
guḍudoḍa nādam̐ḍu kŏṁguvaṭṭi tīsidenu
aṭṭĕ yĕmmĕlam̐ bŏdale dadi vanidā
jaṭṭigŏni yādam̐ḍu sarasamu lāḍidenu
maṭṭumīda navvedi mari yadi vanidā

(||nannu||)
gāraviṁchi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍidenu
ārīdi navvulu navve dadi vanidā
kūrimi nādam̐ḍe sĕkku gorigŏnanŏttidenu
seri mārugumāru sesedi vanidā