నన్ను నింతగాఁ జేసె నావలపు
(॥పల్లవి॥)
నన్ను నింతగాఁ జేసె నావలపు
వున్నతితో నేమని వున్నదో నీమనసు
(॥నన్ను॥)
మంతనాన వేడుకతో మగువా నీవూ నుండఁగ
యింతలో నే వచ్చితి నెఱఁగక
యెంతో తడవాయ విడెమియ్యవలెనంటాఁజుమ్మీ
చెంత నీకు నన్నుఁజూచి సిబ్బితిగాదుగదా
(॥నన్ను॥)
అదిగొని పవళించి యాపెతో మాఎటలాడఎగా
పాదాలోత్తితి నీకు భావించక
పోదితో నలపుదీర భోగింతువంటాఁజుమ్మీ
నాదె చూచి నీకు నవ్వులు రావుగదా
(॥నన్ను॥)
తలకొని యాపె మీఁది తలఁపు నీకుండఁగాను
కలికితనాన నిన్నుఁ గాఁగిలించితి
అలమేలుమంగపతివని సుమ్మీ శ్రీవేంకట-
నిలయ, నన్నుఁ జూచి తెలుసుకోవుగదా
(||pallavi||)
nannu niṁtagām̐ jesĕ nāvalabu
vunnadido nemani vunnado nīmanasu
(||nannu||)
maṁtanāna veḍugado maguvā nīvū nuṁḍam̐ga
yiṁtalo ne vachchidi nĕṟam̐gaga
yĕṁto taḍavāya viḍĕmiyyavalĕnaṁṭām̐jummī
sĕṁta nīgu nannum̐jūsi sibbidigādugadā
(||nannu||)
adigŏni pavaḽiṁchi yābĕdo mǣḍalāḍægā
pādālottidi nīgu bhāviṁchaga
podido nalabudīra bhogiṁtuvaṁṭām̐jummī
nādĕ sūsi nīgu navvulu rāvugadā
(||nannu||)
talagŏni yābĕ mīm̐di talam̐pu nīguṁḍam̐gānu
kaligidanāna ninnum̐ gām̐giliṁchidi
alamelumaṁgabadivani summī śhrīveṁkaḍa-
nilaya, nannum̐ jūsi tĕlusugovugadā