నన్ను నెంత మన్నించెనే నా రమణుఁడు
(॥పల్లవి॥)
నన్ను నెంత మన్నించెనే నా రమణుఁడు
చన్నుల నొత్తఁగానైనా సరిగాఁ బెనఁగెఁగా
(॥నన్ను॥)
అలయిచు నేఁ దన్ను నాడరాని మాటలను
సొలయఁగనైనా మోము చూచెఁగా నేఁడు
బలిమితో నప్పటిని పైకొని కానుకలిచ్చి
పిలువఁగనైనాను ప్రియము చేకొనెఁగా
(॥నన్ను॥)
కక్కసించి తనవేళఁ గాచుకుండి వినయాన
మొక్కఁగానైనా పాదము మోచెఁగా నేఁడు
చిక్కించుక సేయరాని సేవలెల్లాఁ జేసి చేసి
చెక్కు నొక్కఁగా నైనా చిత్తమిటు వచ్చెఁగా
(॥నన్ను॥)
పసగా నేకతమునఁ బానుపుపై నేనిట్టె
కొసరఁగానైనాను కూడెఁగా నేఁడు
యెసగ శ్రీ వేంకటేశుఁ డేలినాఁడు నే రతుల
నెస భోగించఁగ నైనా వేడుకతో నవ్వెఁగా
(||pallavi||)
nannu nĕṁta manniṁchĕne nā ramaṇum̐ḍu
sannula nŏttam̐gānainā sarigām̐ bĕnam̐gĕm̐gā
(||nannu||)
alayisu nem̐ dannu nāḍarāni māḍalanu
sŏlayam̐ganainā momu sūsĕm̐gā nem̐ḍu
balimido nappaḍini paigŏni kānugalichchi
piluvam̐ganainānu priyamu segŏnĕm̐gā
(||nannu||)
kakkasiṁchi tanaveḽam̐ gāsuguṁḍi vinayāna
mŏkkam̐gānainā pādamu mosĕm̐gā nem̐ḍu
sikkiṁchuga seyarāni sevalĕllām̐ jesi sesi
sĕkku nŏkkam̐gā nainā sittamiḍu vachchĕm̐gā
(||nannu||)
pasagā negadamunam̐ bānububai neniṭṭĕ
kŏsaram̐gānainānu kūḍĕm̐gā nem̐ḍu
yĕsaga śhrī veṁkaḍeśhum̐ ḍelinām̐ḍu ne radula
nĕsa bhogiṁcham̐ga nainā veḍugado navvĕm̐gā