నన్నెంత లాలించేవు నగుతా నీవు
(॥పల్లవి॥)
నన్నెంత లాలించేవు నగుతా నీవు
మన్నించుమనఁగలనా మరుగఁగలఁగాక
(॥నన్నెం॥)
నేరుపుతో మాఁటలాడి నిన్ను మెప్పించఁగలనా
చేరి నీతోడ బలిమిసేయఁగలనా
సారెకు నిన్ను గద్దించి సరసమాడఁగలనా
మూరెఁడు గొప్పు వంచుక మొక్కఁగలగాక
(॥నన్నెం॥)
చాయల సన్నల నిన్ను సాదించఁగలనా
నాయములు పచరించి నవ్వఁగలనా
ఆయాలు సోఁకఁ బెనఁగి అలయించఁగలనా
నాయంత నేనుండి నిన్ను నమ్మగలగాక
(॥నన్నెం॥)
కచ్చుపెట్టి నీమతి గరఁగించగలనా
మెచ్చి నీవు వేఁడుకోఁగా మీరఁగలనా
యిచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కొచ్చి యింకా నీపొందే కోరఁగలఁగాక
(||pallavi||)
nannĕṁta lāliṁchevu nagudā nīvu
manniṁchumanam̐galanā marugam̐galam̐gāga
(||nannĕṁ||)
nerubudo mām̐ṭalāḍi ninnu mĕppiṁcham̐galanā
seri nīdoḍa balimiseyam̐galanā
sārĕgu ninnu gaddiṁchi sarasamāḍam̐galanā
mūrĕm̐ḍu gŏppu vaṁchuga mŏkkam̐galagāga
(||nannĕṁ||)
sāyala sannala ninnu sādiṁcham̐galanā
nāyamulu pasariṁchi navvam̐galanā
āyālu som̐kam̐ bĕnam̐gi alayiṁcham̐galanā
nāyaṁta nenuṁḍi ninnu nammagalagāga
(||nannĕṁ||)
kachchubĕṭṭi nīmadi garam̐giṁchagalanā
mĕchchi nīvu vem̐ḍugom̐gā mīram̐galanā
yichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kŏchchi yiṁkā nībŏṁde koram̐galam̐gāga