Nanavamti yaamtadaani nalamgimchavoddayya

ననవంటి యాఁటదాని నలఁగించవొద్దయ్య
Language

(॥పల్లవి॥)
ననవంటి యాఁటదాని నలఁగించవొద్దయ్య
మనసునఁ గలిగితే మన్నించేవుగాక

(॥నన॥)
సిగ్గులు నీమీఁద వేసి చెలి యూరకుండఁగాను
వొగ్గుచునవ్వుమంటాను వొడివట్టేవు
నిగ్గులఁ గన్నెలనెల్లా నీవిట్లాఁ జేసితివా
బగ్గున యెగసక్కేలఁ బైకొనేవుగాక

(॥నన॥)
పంతము నీకప్పగించి పరాకున నుండఁగాను
కాంతను గోర గజెనకి కరఁగించేవు
పొంత కొత్తజవ్వనులఁ బొందితివాఇట్లానే
బంతిరాజసాన రట్టుపరచేవుగాక

(॥నన॥)
కందువ కాఁగిటఁ గూడి కళదేరుచుండఁగాను
అందుకొని మెచ్చుమంటా ఆనవెట్టేవు
పందెపు శ్రీవేంకటేశ పడుచులెడ యిట్టే యా
సందడినీగజరులు చల్లేవు గాక

(||pallavi||)
nanavaṁṭi yām̐ṭadāni nalam̐giṁchavŏddayya
manasunam̐ galigide manniṁchevugāga

(||nana||)
siggulu nīmīm̐da vesi sĕli yūraguṁḍam̐gānu
vŏggusunavvumaṁṭānu vŏḍivaṭṭevu
niggulam̐ gannĕlanĕllā nīviṭlām̐ jesidivā
bagguna yĕgasakkelam̐ baigŏnevugāga

(||nana||)
paṁtamu nīgappagiṁchi parāguna nuṁḍam̐gānu
kāṁtanu gora gajĕnagi karam̐giṁchevu
pŏṁta kŏttajavvanulam̐ bŏṁdidivāiṭlāne
baṁtirājasāna raṭṭubarasevugāga

(||nana||)
kaṁduva kām̐giḍam̐ gūḍi kaḽaderusuṁḍam̐gānu
aṁdugŏni mĕchchumaṁṭā ānavĕṭṭevu
paṁdĕbu śhrīveṁkaḍeśha paḍusulĕḍa yiṭṭe yā
saṁdaḍinīgajarulu sallevu gāga