Nammidimi ninnunu naanaareedula memu

నమ్మితిమి నిన్నును నానారీతుల మేము
Language

(॥పల్లవి॥)
నమ్మితిమి నిన్నును నానారీతుల మేము
నెమ్మనపు మన్ననలు నీచేతి దిఁకను

(॥నమ్మి॥)
మొక్కితిఁగా అల్లనాఁడే మోపులకొలఁదులు
మిక్కిలి యెంచుకో నీమీఁద నున్నవి
నిక్కి చూచితి నిందాఁకా నీకు నెదురై నేను
చిక్కినపుణ్యములు నీచేతిదే ఇఁకను

(॥నమ్మి॥)
పంపితింగా కానికలు బండులకొలఁదులు
ముంపున బండారించి ముడుపైనది
సంపదల నీపేరు జపియించుకొంటా నుంటి
ఇంపులఁ గీర్తులు నీ కెక్కినవే ఇఁకను

(॥నమ్మి॥)
చెప్పితిఁగా ప్రియములు సేనాసేనలు నేఁడు
కుప్పలుగా నీయందు గొనకొన్నవి
చిప్పులఁ గూడితి నిదె శ్రీవేంకంటేశ్వర నిన్ను
చెప్పరానిమెచ్చులెల్లా చెల్లు నీకు నిఁకను

(||pallavi||)
nammidimi ninnunu nānārīdula memu
nĕmmanabu mannanalu nīsedi dim̐kanu

(||nammi||)
mŏkkidim̐gā allanām̐ḍe mobulagŏlam̐dulu
mikkili yĕṁchugo nīmīm̐da nunnavi
nikki sūsidi niṁdām̐kā nīgu nĕdurai nenu
sikkinabuṇyamulu nīsedide im̐kanu

(||nammi||)
paṁpidiṁgā kānigalu baṁḍulagŏlam̐dulu
muṁpuna baṁḍāriṁchi muḍubainadi
saṁpadala nīberu jabiyiṁchugŏṁṭā nuṁṭi
iṁpulam̐ gīrdulu nī kĕkkinave im̐kanu

(||nammi||)
sĕppidim̐gā priyamulu senāsenalu nem̐ḍu
kuppalugā nīyaṁdu gŏnagŏnnavi
sippulam̐ gūḍidi nidĕ śhrīveṁkaṁṭeśhvara ninnu
sĕpparānimĕchchulĕllā sĕllu nīgu nim̐kanu