Nammaraa naamaada neevu nagavu gaadu

నమ్మరా నామాట నీవు నగవు గాదు
Language

(॥పల్లవి॥)
నమ్మరా నామాట నీవు నగవు గాదు
కమ్మర నాబలిమెల్లఁ గనుకొనరా

(॥నమ్మ॥)
మాఁటలాడి మాఁటలాడి మగిడి చూచేవు నీవు
యేఁటికి నీకింత వెఱపేల వచ్చెరా
నీఁటున నెవ్వతెయైనా నిన్ను నేమిసేసినాను
గాఁటముగ నీవిట్టె కాచుకొనేరా

(॥నమ్మ॥)
చేరి చేరి నావొద్ద శిరసువంచేవు నీవు
వారించి యిది నీకెవ్వతే చెప్పెరా
యీరీతి నిందుకుఁగా నెవ్వతె గోపించినాను
ఆరసి నే నీసంది కడ్డమయ్యేరా

(॥నమ్మ॥)
కూడిమాడి నాగోరికొనలకే యలికేవు
వోడక శ్రీవేంకటేశ వూరకుండరా
ఆడనీడ నెవ్వరు నీ కడ్డముగా వచ్చినాను
వేడుక నే నాడుకొనే వేసరకురా

(||pallavi||)
nammarā nāmāḍa nīvu nagavu gādu
kammara nābalimĕllam̐ ganugŏnarā

(||namma||)
mām̐ṭalāḍi mām̐ṭalāḍi magiḍi sūsevu nīvu
yem̐ṭigi nīgiṁta vĕṟabela vachchĕrā
nīm̐ṭuna nĕvvadĕyainā ninnu nemisesinānu
gām̐ṭamuga nīviṭṭĕ kāsugŏnerā

(||namma||)
seri seri nāvŏdda śhirasuvaṁchevu nīvu
vāriṁchi yidi nīgĕvvade sĕppĕrā
yīrīdi niṁdugum̐gā nĕvvadĕ gobiṁchinānu
ārasi ne nīsaṁdi kaḍḍamayyerā

(||namma||)
kūḍimāḍi nāgorigŏnalage yaligevu
voḍaga śhrīveṁkaḍeśha vūraguṁḍarā
āḍanīḍa nĕvvaru nī kaḍḍamugā vachchinānu
veḍuga ne nāḍugŏne vesaragurā