Nammamgalavaara mimte naagu neevichchina baasa

నమ్మఁగలవార మింతే నాకు నీవిచ్చిన బాస
Language

(॥పల్లవి॥)
నమ్మఁగలవార మింతే నాకు నీవిచ్చిన బాస
యిమ్ములఁ జెలులు నీకు యేమి చెప్పే రిఁకను

(॥నమ్మ॥)
నిలువెల్లా నిజమే నీవొళ్లిదే తగవు
తెలిసె నీగుణాలెల్ల తేటతెల్లమి
కలిగినసాజమే కల్లలాడేవా నీవు
బలువుఁడవు నీతోడి పంతములవారమా

(॥నమ్మ॥)
నీ వాడినదు మాఁట నెరసు నీయందు లేదు
దేవరవనేరు నిన్ను దేవుళ్లెల్లా
చేవదేరేనడకలు చెల్లు నీకు నన్నియును
వేవేలు వచ్చెను నీతో విరసాలవారమా

(॥నమ్మ॥)
నిన్నుఁ గాదన రెవ్వరు నీ వటువంటి వాడఁవా
విన్న కన్న వే నీవిద్యలెల్లాను
యిన్నిటా శ్రీవేంకటేశ యిదె నన్ను నేలితివి
మన్నించనేర్తువు నీతో మండాడేవారమా

(||pallavi||)
nammam̐galavāra miṁte nāgu nīvichchina bāsa
yimmulam̐ jĕlulu nīgu yemi sĕppe rim̐kanu

(||namma||)
niluvĕllā nijame nīvŏḽlide tagavu
tĕlisĕ nīguṇālĕlla teḍadĕllami
kaliginasājame kallalāḍevā nīvu
baluvum̐ḍavu nīdoḍi paṁtamulavāramā

(||namma||)
nī vāḍinadu mām̐ṭa nĕrasu nīyaṁdu ledu
devaravaneru ninnu devuḽlĕllā
sevaderenaḍagalu sĕllu nīgu nanniyunu
vevelu vachchĕnu nīdo virasālavāramā

(||namma||)
ninnum̐ gādana rĕvvaru nī vaḍuvaṁṭi vāḍam̐vā
vinna kanna ve nīvidyalĕllānu
yinniḍā śhrīveṁkaḍeśha yidĕ nannu nelidivi
manniṁchanerduvu nīdo maṁḍāḍevāramā