Nammaga tappani nijamaina nuvviga raavani se&

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చె&
Work
Year
Language

పల్లవి:

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ…

ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ…

ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ…

కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా ....

చరణం 1:

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ…

చరణం 2:

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా? సిరిమల్లెల పరిమళమా? చేజారిన ఆశల తొలివరమా..

pallavi:

nammaga tappani nijamaina nuvviga rāvani sĕbudunna
ĕṁdugu vinadŏ nā madi ippuḍainā o…

ĕvvaru ĕduruga vastunna nuvvemo anuguṁṭunna
nī rūbaṁ nā sūbulanodīlenā o…

ĕṁdari to kalisunna nenŏṁṭarigāne unna
nuvvŏḍilina ī egāṁtaṁlonā o…

kannulu tĕrise unna nuvvu ninnaḍi kalave aina
ippaḍigī ā kalalone unnā ....

saraṇaṁ 1:

ī janmaṁtā viḍibodī jaṁṭa ani dīviṁchina guḍi gaṁṭanu iga nā madi viṁṭuṁdā
nā vĕnuvĕṁṭa nuvve leguṁḍā rojū sūsina e soḍainā nanu gurdistuṁdā
niluvuna nanu tarimi ala vĕnudirigina sĕlimi ĕlā taḍi kanulado ninu vĕdigedi ĕlā

nammaga tappani nijamaina nuvviga rāvani sĕbudunna
ĕṁdugu vinadŏ nā madi ippuḍainā o…

saraṇaṁ 2:

nī snehaṁlo vĕlige vĕnnĕllo kŏnnāḽaina saṁtoṣhaṁgā gaḍisāyanugonā
nā ūhallo kalige vedanalo ĕnnāḽaina ī naḍi rādiri gaḍavadu anugonā
sirunavvula parisayamā? sirimallĕla parimaḽamā? sejārina āśhala tŏlivaramā..