నలుగడఁ దన యెమ్మె నా ముందరనే యేల
(॥పల్లవి॥)
నలుగడఁ దన యెమ్మె నా ముందరనే యేల
సొలసి కొలిమిఁ గూఁట సూదులమ్మవలెనా
(॥నలు॥)
పంతమాడనోపఁగాని బలిమెంతయినా గలదు
చెంతఁ దా నాతోనేల చెనకీనే
వంతులకు రాఁగా నీవల పెల్లా నాసొమ్మే
వింతవారి వద్దఁ దనవిద్య చూపుమనవే
(॥నలు॥)
ఆనవెట్టఁ జాలఁగాని అన్నిటాను నిజమరినే
పానిపట్టి నన్ను నేల పచారించీనే
నానఁబెట్టఁగాని నా నవ్వులే సెలవులెల్ల
తానెందైనా సతులతో తమకించుమనవే
(॥నలు॥)
మత్సరించి పెంచఁగాని మంకులెల్లా నా సొమ్మే
ఇచ్చగించి నాతోనేల ఇయ్యకొనీనే
అచ్చపు శ్రీ వేంకటేశుఁడన్నిటాను నన్నుఁ గూడె
విచ్చి చెప్పి ఇందరికి వినిపించుమనవే
(||pallavi||)
nalugaḍam̐ dana yĕmmĕ nā muṁdarane yela
sŏlasi kŏlimim̐ gūm̐ṭa sūdulammavalĕnā
(||nalu||)
paṁtamāḍanobam̐gāni balimĕṁtayinā galadu
sĕṁtam̐ dā nādonela sĕnagīne
vaṁtulagu rām̐gā nīvala pĕllā nāsŏmme
viṁtavāri vaddam̐ danavidya sūbumanave
(||nalu||)
ānavĕṭṭam̐ jālam̐gāni anniḍānu nijamarine
pānibaṭṭi nannu nela pasāriṁchīne
nānam̐bĕṭṭam̐gāni nā navvule sĕlavulĕlla
tānĕṁdainā sadulado tamagiṁchumanave
(||nalu||)
matsariṁchi pĕṁcham̐gāni maṁkulĕllā nā sŏmme
ichchagiṁchi nādonela iyyagŏnīne
achchabu śhrī veṁkaḍeśhum̐ḍanniḍānu nannum̐ gūḍĕ
vichchi sĕppi iṁdarigi vinibiṁchumanave