నలినాక్షి నిన్నుఁ జూచి నవ్వువచ్చె మాకెల్ల
(॥పల్లవి॥)
నలినాక్షి నిన్నుఁ జూచి నవ్వువచ్చె మాకెల్ల
చలపట్టితే పంతము చవుకాయను
(॥నలి॥)
తలఁచఁగఁ దలఁచఁగ తనలోనె మరు డుండె
చెలి బెదరి యట్టె నీచేయి వట్టెను
అలిగి యెవ్వరిమాఁట అటమున్ను వినదాయ
వులికి యిప్పుడు తానె వొక్కటాయను
(॥నలి॥)
చెక్కు చేతఁబెట్టఁగానే చిగురు బాణమాయ
గక్కన నీరెంటె మిఁమిం)తి గప్పుకొనెను
మొక్కే రమ్మన్నా రాదు మొదల నీ గాత వంక
చిక్కి నేఁడు తానే నీ చేతికి లోనాయను
(॥నలి॥)
కందువ నిద్దిరించితే కలలో నీవు గూడితి
విందుకే తా నిన్నుఁ గూడె యిచ్చకానను
సందడి శ్రీ వేంకటేశ సరివచ్చె మామాఁట
పొందిక లొక్కొక్కటికి పోదులై నిలిచెను
(||pallavi||)
nalinākṣhi ninnum̐ jūsi navvuvachchĕ māgĕlla
salabaṭṭide paṁtamu savugāyanu
(||nali||)
talam̐sam̐gam̐ dalam̐sam̐ga tanalonĕ maru ḍuṁḍĕ
sĕli bĕdari yaṭṭĕ nīseyi vaṭṭĕnu
aligi yĕvvarimām̐ṭa aḍamunnu vinadāya
vuligi yippuḍu tānĕ vŏkkaḍāyanu
(||nali||)
sĕkku sedam̐bĕṭṭam̐gāne siguru bāṇamāya
gakkana nīrĕṁṭĕ mim̐miṁ)ti gappugŏnĕnu
mŏkke rammannā rādu mŏdala nī gāda vaṁka
sikki nem̐ḍu tāne nī sedigi lonāyanu
(||nali||)
kaṁduva niddiriṁchide kalalo nīvu gūḍidi
viṁduge tā ninnum̐ gūḍĕ yichchagānanu
saṁdaḍi śhrī veṁkaḍeśha sarivachchĕ māmām̐ṭa
pŏṁdiga lŏkkŏkkaḍigi podulai nilisĕnu