నడివిడి(వీది?) మాటలు నాయమా నీకు
(॥పల్లవి॥)
నడివిడి(వీది?) మాటలు నాయమా నీకు
పిడితెఁడు చల్ల వోసేఁ బెనఁగకువోయీ
(॥నడి॥)
గొల్లవారము మాకుల మేమియడిగేవు
మొల్లమిగా జాణతనములు నేరము
చొల్లెపుజుట్టులతోడ సుద్దు లెందాఁకాఁ జేప్పేవు
అల్లదె మాయిల్లు దాయాలాడుదము రావోయి
(॥నడి॥)
దొడ్డివారము మేము దొవేల చూపుమనేవు
వొడ్డారపుఁ జేఁతల కొపము నేము
బిడ్డ నాచేతనున్నది ప్రేమతో నేమినవ్వేవు
జిడ్డుచేత విడెమిచ్చేఁ జేతువు రావొయీ
(॥నడి॥)
అలఁగాచేవారము మాయంగా లెంతపోగడేవు
మేలేఱిఁగి మెచ్చఁగ నేమీ నెఱఁగము
అలరిశ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
యేలితివి నన్నునీడ నిట్టె రావోయీ
(||pallavi||)
naḍiviḍi(vīdi?) māḍalu nāyamā nīgu
piḍidĕm̐ḍu salla vosem̐ bĕnam̐gaguvoyī
(||naḍi||)
gŏllavāramu māgula memiyaḍigevu
mŏllamigā jāṇadanamulu neramu
sŏllĕbujuṭṭuladoḍa suddu lĕṁdām̐kām̐ jeppevu
alladĕ māyillu dāyālāḍudamu rāvoyi
(||naḍi||)
dŏḍḍivāramu memu dŏvela sūbumanevu
vŏḍḍārabum̐ jem̐tala kŏbamu nemu
biḍḍa nāsedanunnadi premado neminavvevu
jiḍḍuseda viḍĕmichchem̐ jeduvu rāvŏyī
(||naḍi||)
alam̐gāsevāramu māyaṁgā lĕṁtabogaḍevu
meleṟim̐gi mĕchcham̐ga nemī nĕṟam̐gamu
alariśhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
yelidivi nannunīḍa niṭṭĕ rāvoyī