Naavalla gadama yede nannela gora seseene

నావల్ల గడమ యేదే నన్నేల గోర సేసీనే
Language

(॥పల్లవి॥)
నావల్ల గడమ యేదే నన్నేల గోర సేసీనే
యేవేళకావేళ ఇంపుసేయనైతినా

(॥నావ॥)
సూడిదెగాఁ దా నెవ్వతె సుద్దులు నాతోఁ జెప్పినా
వేడుకతోఁ జెవులొగ్గి విన నైతినా
యేడనుండి వచ్చినాను యెదురుకొని మోమెత్తి
జోడుగూడి తన దిక్కు చూడనైతినా

(॥నావ॥)
చిడుముడి వింత వింత సింగారాలతో నుండఁగా
నడుమ నందుకు మెచ్చి నవ్వనైతినా
కడువేఁడి చెమటలు గారఁగాఁ దనమేను
విడువక సురటిని విసర నైతినా

(॥నావ॥)
ఇట్టె పరిమళాలు యెవ్వరివి పూసుకొన్నా
గుట్టుతోడఁ గాఁగిలించుకొన నైతినా
నెట్టన శ్రీ వేంకటాద్రినిలయుఁడు నన్నుఁ గూడె
చుట్టరికము లెల్లాను చూపనైతినా

(||pallavi||)
nāvalla gaḍama yede nannela gora sesīne
yeveḽagāveḽa iṁpuseyanaidinā

(||nāva||)
sūḍidĕgām̐ dā nĕvvadĕ suddulu nādom̐ jĕppinā
veḍugadom̐ jĕvulŏggi vina naidinā
yeḍanuṁḍi vachchinānu yĕdurugŏni momĕtti
joḍugūḍi tana dikku sūḍanaidinā

(||nāva||)
siḍumuḍi viṁta viṁta siṁgārālado nuṁḍam̐gā
naḍuma naṁdugu mĕchchi navvanaidinā
kaḍuvem̐ḍi sĕmaḍalu gāram̐gām̐ danamenu
viḍuvaga suraḍini visara naidinā

(||nāva||)
iṭṭĕ parimaḽālu yĕvvarivi pūsugŏnnā
guṭṭudoḍam̐ gām̐giliṁchugŏna naidinā
nĕṭṭana śhrī veṁkaḍādrinilayum̐ḍu nannum̐ gūḍĕ
suṭṭarigamu lĕllānu sūbanaidinā