నావలెఁ గాదువో యీపె నంటున నోరుచుకోను
(॥పల్లవి॥)
నావలెఁ గాదువో యీపె నంటున నోరుచుకోను
చేవలు మీరఁగఁబోతే చెలి ఇంతకోర్చునా
(॥నావ॥)
చల్లనిచూపులఁ జూచి సళిపించినందులోనే
కల్ల లేమాడితివో ఆకాంత తోను
అల్ల నీవోజెఱఁగనా అంది నాతో నాడినట్టే
చిల్లరలీడ నాడితే చెవి ఇంత కోర్చునా
(॥నావ॥)
చాయలు సన్నలుఁ జేసి జంకించినందులోనే
చేయార నేమిసేసితో చేరి యీపెను
మాయలు నే నెఱఁగనా మమ్ము నీవు సేసినట్టే
సేయఁబోతే గొణఁగక చెలి ఇంతకోర్చునా
(॥నావ॥)
పక్కనఁ గాఁగిటఁ గూడి పచ్చిసేసినందులోనే
ఇక్కువ లెందంటితివో యీ ఇంతిని
తక్కించి శ్రీ వేంకటేశ తగ నన్నుఁ గూడినట్టే
చిక్కించుకొంటే నేఁడు చెలి ఇంతకోర్చునా
(||pallavi||)
nāvalĕm̐ gāduvo yībĕ naṁṭuna norusugonu
sevalu mīram̐gam̐bode sĕli iṁtagorsunā
(||nāva||)
sallanisūbulam̐ jūsi saḽibiṁchinaṁdulone
kalla lemāḍidivo āgāṁta tonu
alla nīvojĕṟam̐ganā aṁdi nādo nāḍinaṭṭe
sillaralīḍa nāḍide sĕvi iṁta korsunā
(||nāva||)
sāyalu sannalum̐ jesi jaṁkiṁchinaṁdulone
seyāra nemisesido seri yībĕnu
māyalu ne nĕṟam̐ganā mammu nīvu sesinaṭṭe
seyam̐bode gŏṇam̐gaga sĕli iṁtagorsunā
(||nāva||)
pakkanam̐ gām̐giḍam̐ gūḍi pachchisesinaṁdulone
ikkuva lĕṁdaṁṭidivo yī iṁtini
takkiṁchi śhrī veṁkaḍeśha taga nannum̐ gūḍinaṭṭe
sikkiṁchugŏṁṭe nem̐ḍu sĕli iṁtagorsunā