నావల నింతేశాయ నాథుఁడ నీవంకఁ గాదు
(॥పల్లవి॥)
నావల నింతేశాయ నాథుఁడ నీవంకఁ గాదు
చేవలుదేరి తేరి చిగురాయను
(॥నావ॥)
తెగనాడఁజాలక తేరి యిచ్చలాడఁగాను
పగటునీవోజలెల్లాఁ బలచనాయ
నగి నగి నీతోను ననుపు నటించఁగాను
అగడై కరుకుపడె అదిగో నీచిత్తము
(॥నావ॥)
వూరకే మొగమోట నొదిగి నే నుండఁగాను
కూరిమినవ్వులు పైకొసరాయను
నీరువంకతుంగవలె నిన్ను నిట్టె భోగించఁగా
సారపుతరితీపులు చప్పనాయను
(॥నావ॥)
కందువకాఁగిట నిన్ను కడుదిద్దకుండఁగాను
విందుల వంటి నీరతులు వింతలాయను
అందపు శ్రీవేంకటేశ అంతలో నన్నుఁ గూడితి
ముందువెనకలెల్లాను ముదమాయను
(||pallavi||)
nāvala niṁteśhāya nāthum̐ḍa nīvaṁkam̐ gādu
sevaluderi teri sigurāyanu
(||nāva||)
tĕganāḍam̐jālaga teri yichchalāḍam̐gānu
pagaḍunīvojalĕllām̐ balasanāya
nagi nagi nīdonu nanubu naḍiṁcham̐gānu
agaḍai karugubaḍĕ adigo nīsittamu
(||nāva||)
vūrage mŏgamoḍa nŏdigi ne nuṁḍam̐gānu
kūriminavvulu paigŏsarāyanu
nīruvaṁkaduṁgavalĕ ninnu niṭṭĕ bhogiṁcham̐gā
sārabudaridībulu sappanāyanu
(||nāva||)
kaṁduvagām̐giḍa ninnu kaḍudiddaguṁḍam̐gānu
viṁdula vaṁṭi nīradulu viṁtalāyanu
aṁdabu śhrīveṁkaḍeśha aṁtalo nannum̐ gūḍidi
muṁduvĕnagalĕllānu mudamāyanu