Naavadda nunnaamdu veemde naa vibhumdu

నావద్ద నున్నాఁడు వీఁడె నా విభుఁడు
Language

(॥పల్లవి॥)
నావద్ద నున్నాఁడు వీఁడె నా విభుఁడు
చేవ మీరఁ జూడరమ్మ చెలులాల మీరు

(॥నావ॥)
జాలిఁ బడి వూరఁగల సవతు లెంత చెప్పినా
యేలిన రమణునకు యేల పొయ్యీనే
చాలా నాపై బత్తిగల సరసుఁడు నాసొమ్మే
కూళ సతులకు కష్టగుణమే దక్కెను

(॥నావ॥)
చూడఁ జాలని వారలు సూటి యెంత దప్పించినా
వేడుక నాపతి యేల విడిచీనే
వాడిక గల మగఁడు వసము నాకైనాఁడు
వాడ సవతులకు నెవ్వగలే నిలిచెను

(॥నావా॥)
పొద్దువోని మగువలు బోదించి పెనఁగినా
వొద్దనున్న యీతఁడేల వోరసేసీనే
గద్దరి శ్రీ వేంకటాద్రి ఘనుఁడు దా నన్నుఁ గూడె
బద్దుల కాంతలకు వుప్పతింపులే మించెను

(||pallavi||)
nāvadda nunnām̐ḍu vīm̐ḍĕ nā vibhum̐ḍu
seva mīram̐ jūḍaramma sĕlulāla mīru

(||nāva||)
jālim̐ baḍi vūram̐gala savadu lĕṁta sĕppinā
yelina ramaṇunagu yela pŏyyīne
sālā nābai battigala sarasum̐ḍu nāsŏmme
kūḽa sadulagu kaṣhṭaguṇame dakkĕnu

(||nāva||)
sūḍam̐ jālani vāralu sūḍi yĕṁta dappiṁchinā
veḍuga nābadi yela viḍisīne
vāḍiga gala magam̐ḍu vasamu nāgainām̐ḍu
vāḍa savadulagu nĕvvagale nilisĕnu

(||nāvā||)
pŏdduvoni maguvalu bodiṁchi pĕnam̐ginā
vŏddanunna yīdam̐ḍela vorasesīne
gaddari śhrī veṁkaḍādri ghanum̐ḍu dā nannum̐ gūḍĕ
baddula kāṁtalagu vuppadiṁpule miṁchĕnu