నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో
పల్లవి:
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు
శివా శంభు లింగా...
లింగా రామారాజ్యం తీరు సూడు
శివా శంభు లింగా...
చరణం 1:
తిందామంటే తిండీలేదు
ఉందామంటే ఇల్లేలేదు || 2 ||
చేదామంటే కొలువు లేదు
పోదామంటే నెలవు లేదు || నాంపల్లి ||
చరణం 2:
గుక్కెడు గంజీ కరువైపాయే
బక్కటి ప్రాణం బరువైపాయే || 2 ||
బీదాబిక్కి పొటలు గొట్టి
మేడలు కట్టె సీకటి శెట్టి || నాంపల్లి ||
చరణం 3:
లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకే అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టేబట్ట బరువైపాయే || నాంపల్లి ||
ముందు ముక్కులు ఎనక తప్పులు
ఉన్నవాడికే అన్నీ చెల్లును || 2 ||
ఉలకావేమి పలకావేమి
బండారాయిగ మారిన సామి || నాంపల్లి ||
pallavi:
nāṁpalli ṭeṣhan kāḍi rājāliṁgo... rājāliṁgā
rāmārājyaṁ tīru sūḍu
śhivā śhaṁbhu liṁgā...
liṁgā rāmārājyaṁ tīru sūḍu
śhivā śhaṁbhu liṁgā...
saraṇaṁ 1:
tiṁdāmaṁṭe tiṁḍīledu
uṁdāmaṁṭe illeledu || 2 ||
sedāmaṁṭe kŏluvu ledu
podāmaṁṭe nĕlavu ledu || nāṁpalli ||
saraṇaṁ 2:
gukkĕḍu gaṁjī karuvaibāye
bakkaḍi prāṇaṁ baruvaibāye || 2 ||
bīdābikki pŏḍalu gŏṭṭi
meḍalu kaṭṭĕ sīgaḍi śhĕṭṭi || nāṁpalli ||
saraṇaṁ 3:
leni ammadi adugula badugu
unna bŏmmage aṁdaṁ ĕruvu
kārallona tirige talligi kaṭṭebaṭṭa baruvaibāye || nāṁpalli ||
muṁdu mukkulu ĕnaga tappulu
unnavāḍige annī sĕllunu || 2 ||
ulagāvemi palagāvemi
baṁḍārāyiga mārina sāmi || nāṁpalli ||