Naamoga matte soosi navve vademayyaa

నామొక మట్టె చూచి నవ్వే వదేమయ్యా
Language

(॥పల్లవి॥)
నామొక మట్టె చూచి నవ్వే వదేమయ్యా
కోమలి నొకతెఁ బేరుకొనవయ్య నీకును

(॥నామొ॥)
వరుసకు నొకసతి వచ్చి కాచుకున్నది
సరసాన కొకయింతి చాలివున్నది
మరగించేననొకతే మాటలాడుచున్నది
తెరలోని కెవ్వతెనుఁ దెత్తునయ్య నీకును

(॥నామొ॥)
నిదురకు నొకభామ నీతోఁ జెప్పమన్నది
పెదవితేనె కొకతె ప్రియపడీని
సదరాన వలపులు చల్లీ నొకవనితె
కదియ నెవ్వతెకు నుంగర మంపేవయ్యా

(॥నామొ॥)
పగడసాలాడ నొకపడఁతి గాచుకున్నది
నగుతా నొకతె నిన్ను నాఁటఁజూచీని
అగపడి కలసితి వందరి శ్రీవేంకటేశ
తగ నన్నేలితివి చిత్తమింకా నెందున్నది

(||pallavi||)
nāmŏga maṭṭĕ sūsi navve vademayyā
komali nŏgadĕm̐ berugŏnavayya nīgunu

(||nāmŏ||)
varusagu nŏgasadi vachchi kāsugunnadi
sarasāna kŏgayiṁti sālivunnadi
maragiṁchenanŏgade māḍalāḍusunnadi
tĕraloni kĕvvadĕnum̐ dĕttunayya nīgunu

(||nāmŏ||)
niduragu nŏgabhāma nīdom̐ jĕppamannadi
pĕdavidenĕ kŏgadĕ priyabaḍīni
sadarāna valabulu sallī nŏgavanidĕ
kadiya nĕvvadĕgu nuṁgara maṁpevayyā

(||nāmŏ||)
pagaḍasālāḍa nŏgabaḍam̐ti gāsugunnadi
nagudā nŏgadĕ ninnu nām̐ṭam̐jūsīni
agabaḍi kalasidi vaṁdari śhrīveṁkaḍeśha
taga nannelidivi sittamiṁkā nĕṁdunnadi