నామీఁది బత్తితోడ నన్నుఁ బాయకున్నాఁడవు
(॥పల్లవి॥)
నామీఁది బత్తితోడ నన్నుఁ బాయకున్నాఁడవు
వేమరు నుపాయాలు విచారించుకోవయ్యా
(॥నామీఁ॥)
ఇంటికి రావైతివంటా యెక్కడనో వుంటివంటా
కంటకము లే మాడునో కలికి నిన్ను
దంటతనాన నేమని తప్పించుకొనేవు నీవు
కంటే మొకదాకిరి గన మాపె యెడకు
(॥నామీఁ॥)
చెమట మెఇ నున్నదంటా చెదరె నీ కురులంటా
తమకించి యేమనునో తరుణి నిన్ను
అమర నెట్లా మాటలాడుకొనేవో నీవు
సముకాన నిచ్చకుఁడవు నీవు
(॥నామీఁ॥)
నాకు మేలువాఁడవంటా నమ్మిక లిచ్చితివంటా
యీకె రతి నెంత యలయించునో నిన్ను
చేకొని న న్నేలితివి శ్రీవేంకటేశుఁడ
పైకొని యాపె నెట్టొడఁబరచేవో నీవు
(||pallavi||)
nāmīm̐di battidoḍa nannum̐ bāyagunnām̐ḍavu
vemaru nubāyālu visāriṁchugovayyā
(||nāmīm̐||)
iṁṭigi rāvaidivaṁṭā yĕkkaḍano vuṁṭivaṁṭā
kaṁṭagamu le māḍuno kaligi ninnu
daṁṭadanāna nemani tappiṁchugŏnevu nīvu
kaṁṭe mŏgadāgiri gana mābĕ yĕḍagu
(||nāmīm̐||)
sĕmaḍa mĕi nunnadaṁṭā sĕdarĕ nī kurulaṁṭā
tamagiṁchi yemanuno taruṇi ninnu
amara nĕṭlā māḍalāḍugŏnevo nīvu
samugāna nichchagum̐ḍavu nīvu
(||nāmīm̐||)
nāgu meluvām̐ḍavaṁṭā nammiga lichchidivaṁṭā
yīgĕ radi nĕṁta yalayiṁchuno ninnu
segŏni na nnelidivi śhrīveṁkaḍeśhum̐ḍa
paigŏni yābĕ nĕṭṭŏḍam̐barasevo nīvu