Naamaamta vinavayyaa navvulu mareyyeemgaani

నామాఁట వినవయ్యా నవ్వులు మరెయ్యీఁగాని
Language

(॥పల్లవి॥)
నామాఁట వినవయ్యా నవ్వులు మరెయ్యీఁగాని
కామించినప్పడే కలయుటే మేలు

(॥నామాఁ॥)
పలుకులఁ బెల్లవారె పంతమెల్లా నీడేరె
చెలియిచ్చిన కానుక చేకొనవయ్యా
వలపించినవాఁడవు వట్టి జోలిఁబెట్టవద్దు
పిలిచినప్పడే వచ్చి బెరయుటే మేలు

(॥నామాఁ॥)
సింగారించనే పట్టె సిగ్గులెల్లాఁ దుదముట్టె
అంగన నెప్పడు గూడే వదేమయ్యా
వుంగర మంపిన వాఁడ వూరకే వుండఁగవద్దు
కొంగువట్టినప్పడే కూడుటే మేలు

(॥నామాఁ॥)
ముచ్చటలు గడురేఁగె మోవిపండ్లూ మాఁగె
నెచ్చెలిని యిప్పడే మన్నించవయ్యా
యిచ్చటఁ బెండ్లాడితివి యీకెను శ్రీవేంకటేశ
మచ్చిక లిట్టే సేసి మరుగుమే మేలు

(||pallavi||)
nāmām̐ṭa vinavayyā navvulu marĕyyīm̐gāni
kāmiṁchinappaḍe kalayuḍe melu

(||nāmām̐||)
palugulam̐ bĕllavārĕ paṁtamĕllā nīḍerĕ
sĕliyichchina kānuga segŏnavayyā
valabiṁchinavām̐ḍavu vaṭṭi jolim̐bĕṭṭavaddu
pilisinappaḍe vachchi bĕrayuḍe melu

(||nāmām̐||)
siṁgāriṁchane paṭṭĕ siggulĕllām̐ dudamuṭṭĕ
aṁgana nĕppaḍu gūḍe vademayyā
vuṁgara maṁpina vām̐ḍa vūrage vuṁḍam̐gavaddu
kŏṁguvaṭṭinappaḍe kūḍuḍe melu

(||nāmām̐||)
muchchaḍalu gaḍurem̐gĕ movibaṁḍlū mām̐gĕ
nĕchchĕlini yippaḍe manniṁchavayyā
yichchaḍam̐ bĕṁḍlāḍidivi yīgĕnu śhrīveṁkaḍeśha
machchiga liṭṭe sesi marugume melu