Naaluga tudane po naanaavidhamulunu

నాలుక తుదనే పో నానావిధములును
Language

(॥పల్లవి॥)
నాలుక తుదనే పో నానావిధములును
యేలేపతి కడకు నిప్పుడే రాఁగదవే

(॥నాలు॥)
చింతించఁజంతించ చిత్తములోనే నుయ్యి
అంతలో సంతసించిన నదే కొండ
పంతమున సలిగితే ప్రాణనాయకుఁడే పగ
చెంతగూడిన నాతఁడే చేతిలోనిదేవుఁడు

(॥నాలు॥)
కన్నుముయ్యఁ గన్నుముయ్యఁ గప్పిన దింతాఁ జీకటే
అన్నిటాఁ జూడఁజూడఁగ నదే వెలుఁగు
పన్ని మనసురాకున్నఁ బలుకెల్లా వెంగేలే
తిన్ననై యెనయుచోటఁ దిట్టులే దీవెనలు

(॥నాలు॥)
పరుసము చేఁతనుంటేఁ బట్టినదెల్లా బంగారే
యెరవై వూరకవుంటే విను మినుమే
యిరవైన శ్రీవేంకటేశురతులే యలపు
పరవశము గోరిన వచ్చికారముఁ దీపే

(||pallavi||)
nāluga tudane po nānāvidhamulunu
yelebadi kaḍagu nippuḍe rām̐gadave

(||nālu||)
siṁtiṁcham̐jaṁtiṁcha sittamulone nuyyi
aṁtalo saṁtasiṁchina nade kŏṁḍa
paṁtamuna saligide prāṇanāyagum̐ḍe paga
sĕṁtagūḍina nādam̐ḍe sedilonidevum̐ḍu

(||nālu||)
kannumuyyam̐ gannumuyyam̐ gappina diṁtām̐ jīgaḍe
anniḍām̐ jūḍam̐jūḍam̐ga nade vĕlum̐gu
panni manasurāgunnam̐ balugĕllā vĕṁgele
tinnanai yĕnayusoḍam̐ diṭṭule dīvĕnalu

(||nālu||)
parusamu sem̐tanuṁṭem̐ baṭṭinadĕllā baṁgāre
yĕravai vūragavuṁṭe vinu minume
yiravaina śhrīveṁkaḍeśhuradule yalabu
paravaśhamu gorina vachchigāramum̐ dībe