Naagum gaanavachchee nee nadanalellaa

నాకుఁ గానవచ్చీ నీ నటనలెల్లా
Language

(॥పల్లవి॥)
నాకుఁ గానవచ్చీ నీ నటనలెల్లా
నీకుఁ జూడ నన్నియును నేరుపులై యున్నవి

(॥నాకుఁ॥)
తలకొని నాదిక్కు తప్పకచూచేవు గాని
తలఁపులో వేరొకతె తగిలున్నది
మలసి నిజాలకును మాటలు నాడేవుగాని
యెలమి నీకోరికలు యెక్కడనో వున్నవి

(॥నాకుఁ॥)
నడుమ నూరకె నాతో నవ్వులు నవ్వేవు గాని
అడరినవలపు విఁ(విం?) తై వున్నది
జడిగొని నాపైఁ జేయి చాఁచఁగ వచ్చేవుగాని
చిడుముడితమి వలసినచోట నున్నది

(॥నాకుఁ॥)
గట్టిగా నీకాయము నాకాఁగిట నున్నది గాని
చుట్టరికములెల్లాఁ జుట్టుకొన్నది
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్నేలితిగాని
రట్టడిపంతాలు రతి నిట్టె పాయకున్నవి

(||pallavi||)
nāgum̐ gānavachchī nī naḍanalĕllā
nīgum̐ jūḍa nanniyunu nerubulai yunnavi

(||nāgum̐||)
talagŏni nādikku tappagasūsevu gāni
talam̐pulo verŏgadĕ tagilunnadi
malasi nijālagunu māḍalu nāḍevugāni
yĕlami nīgorigalu yĕkkaḍano vunnavi

(||nāgum̐||)
naḍuma nūragĕ nādo navvulu navvevu gāni
aḍarinavalabu vim̐(viṁ?) tai vunnadi
jaḍigŏni nābaim̐ jeyi sām̐sam̐ga vachchevugāni
siḍumuḍidami valasinasoḍa nunnadi

(||nāgum̐||)
gaṭṭigā nīgāyamu nāgām̐giḍa nunnadi gāni
suṭṭarigamulĕllām̐ juṭṭugŏnnadi
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannelidigāni
raṭṭaḍibaṁtālu radi niṭṭĕ pāyagunnavi