Naagoragu vinnavimcha nannu bhogimchedi neegu

నాకొరకు విన్నవించ నన్ను భోగించేటి నీకు
Language

(॥పల్లవి॥)
నాకొరకు విన్నవించ నన్ను భోగించేటి నీకు
జోకల యీ యలమట సోఁకీనని కాని

(॥నా కొర॥)
సవతుల మాటలకు జడిసి నేఁ జిన్నఁబోఁగా
నవకమై నీకెట్ల నవ్వు వచ్చెనో
కవగూడే వప్పటి యీ కతలనే వేఁగినట్టి
ఇవల నామేనెట్ల నితవాయనో

(॥నా కొర॥)
వాడవారి చేఁతలకు వాడుదేరి నేనుండఁగా
జాడ నీకెట్ల సంతసములాయనో
తోడనే పొందేవు యీ విదు(ద్ధు)లఁబడి నిట్టూర్పుల
వీడు పడ్డ నామోవెట్టు ప్రియమాయనో

(॥నా కొర॥)
దుండగీలసటలకు తోడనే నీ కొప్పించఁగా
గుండె దాఁకెట్లఁ జులుకులు వుట్టెనో
నిండుగ శ్రీ వేంకటేశ నేఁడెనసి మన్నించితి
దండి నీకు నాపై నెట్టు దయవుట్టెనో

(||pallavi||)
nāgŏragu vinnaviṁcha nannu bhogiṁcheḍi nīgu
jogala yī yalamaḍa som̐kīnani kāni

(||nā kŏra||)
savadula māḍalagu jaḍisi nem̐ jinnam̐bom̐gā
navagamai nīgĕṭla navvu vachchĕno
kavagūḍe vappaḍi yī kadalane vem̐ginaṭṭi
ivala nāmenĕṭla nidavāyano

(||nā kŏra||)
vāḍavāri sem̐talagu vāḍuderi nenuṁḍam̐gā
jāḍa nīgĕṭla saṁtasamulāyano
toḍane pŏṁdevu yī vidu(ddhu)lam̐baḍi niṭṭūrbula
vīḍu paḍḍa nāmovĕṭṭu priyamāyano

(||nā kŏra||)
duṁḍagīlasaḍalagu toḍane nī kŏppiṁcham̐gā
guṁḍĕ dām̐kĕṭlam̐ julugulu vuṭṭĕno
niṁḍuga śhrī veṁkaḍeśha nem̐ḍĕnasi manniṁchidi
daṁḍi nīgu nābai nĕṭṭu dayavuṭṭĕno