(॥పల్లవి॥)
నాకేల వెరచేవు నడుమ నీవు
నీ కిచ్చకురాల నింతే నిన్ను మీరేనా
(॥నాకే॥)
సారె జారేవచ్చడము చక్కఁగప్పవచ్చితిఁగా
కీరీతి నీమేనఁ జొప్పులెత్తఁగవచ్చితినా
గోర దిద్దఁగ నామము కూరిమిఁ జూచితిఁ గాక
పోరి నొసలి లత్తుకబొట్లు చూచితినా
(॥నాకే॥)
ఆకుమడిచి నీమోవి కంది నే నిచ్చితిఁగా
రేకగా మోవికెంపులు రేఁగఁగ నిచ్చితినా
పైకొని నీ చెమటలు పయ్యద నొత్తితిఁగాక
కాకుసేసి నిన్ను చనుఁ గవల నొత్తితినా
(॥నాకే॥)
కందువ నీచెలిలో నేకతము లాడితిఁగాక
నిందలు గడించి నేఁడు నీతో నాడితినా
యిందునె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అందాలు సేసితిఁగాక యాఱడి సేసితినా
(||pallavi||)
nāgela vĕrasevu naḍuma nīvu
nī kichchagurāla niṁte ninnu mīrenā
(||nāge||)
sārĕ jārevachchaḍamu sakkam̐gappavachchidim̐gā
kīrīdi nīmenam̐ jŏppulĕttam̐gavachchidinā
gora diddam̐ga nāmamu kūrimim̐ jūsidim̐ gāga
pori nŏsali lattugabŏṭlu sūsidinā
(||nāge||)
āgumaḍisi nīmovi kaṁdi ne nichchidim̐gā
regagā movigĕṁpulu rem̐gam̐ga nichchidinā
paigŏni nī sĕmaḍalu payyada nŏttidim̐gāga
kāgusesi ninnu sanum̐ gavala nŏttidinā
(||nāge||)
kaṁduva nīsĕlilo negadamu lāḍidim̐gāga
niṁdalu gaḍiṁchi nem̐ḍu nīdo nāḍidinā
yiṁdunĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
aṁdālu sesidim̐gāga yāṟaḍi sesidinā