నాకేల వేగిరము నమ్మితి నేను
(॥పల్లవి॥)
నాకేల వేగిరము నమ్మితి నేను
మేకొని నీవే నన్ను మెచ్చేవుగాని
(॥॥)
ప్రియురాలు విభునితో పెనఁగులాడఁగఁబోతే
నయమున వూరివారు నవ్వఁజూతురు
క్రియ గూడ నిట్టె చేతికిని లోనై వుండఁగాను
దయ నీచిత్తములోన తానే వుండీఁగాని
(॥॥)
పాయరానివారు నీతే పంతము లాడఁగఁబోతే
కాయకపుసవతులు కాకుసేతురు
వోయి నీవెంతసేసినా నోరుచుకవుండఁగాను
యీయెడ నీవే తగవు యెఱిఁగేవుగాని
(॥॥)
కందువ నే నిట్టె నిన్నుఁగాఁగిలించి కూడఁబోతే
పొందైన నీసతులెల్లాఁ బొగడుదురు
ఇందులో శ్రీవేంకటేశ యేలితి విట్టె వుండఁగా
మందలించి నీవే యింకా మన్నించేవుగాని
(||pallavi||)
nāgela vegiramu nammidi nenu
megŏni nīve nannu mĕchchevugāni
(||||)
priyurālu vibhunido pĕnam̐gulāḍam̐gam̐bode
nayamuna vūrivāru navvam̐jūduru
kriya gūḍa niṭṭĕ sedigini lonai vuṁḍam̐gānu
daya nīsittamulona tāne vuṁḍīm̐gāni
(||||)
pāyarānivāru nīde paṁtamu lāḍam̐gam̐bode
kāyagabusavadulu kāguseduru
voyi nīvĕṁtasesinā norusugavuṁḍam̐gānu
yīyĕḍa nīve tagavu yĕṟim̐gevugāni
(||||)
kaṁduva ne niṭṭĕ ninnum̐gām̐giliṁchi kūḍam̐bode
pŏṁdaina nīsadulĕllām̐ bŏgaḍuduru
iṁdulo śhrīveṁkaḍeśha yelidi viṭṭĕ vuṁḍam̐gā
maṁdaliṁchi nīve yiṁkā manniṁchevugāni