Naage sadamainappudu nammemgaani

నాకె సతమైనప్పుడు నమ్మేఁగాని
Language

(॥పల్లవి॥)
నాకె సతమైనప్పుడు నమ్మేఁగాని
చీకాకు కొనగోర చిమ్మకురా నన్నును

(॥నాకె ॥)
వడఁగండ్లగుళ్లాయ వానలేని జళ్లాయ
వొడఁబాటు లిఁకనేనల వోపరా నేను
ముడిలేనివలలాయ మూఁగగన్నకలలాయ
యెడనెడ నీపొందు; లేఁపకురా నన్నును

(॥నాకె॥)
యెండమావినీళ్లాయ యెదుటి గుక్కిళ్లాయ
చండితో నీవినయాలు చాలురా నేఁడు
వండ వండనట్లాయ వావిగావి వొట్లాయ
అండనే మొక్కులు మొక్కే అంటకురా నన్నును

(॥నాకె॥)
తినఁదినఁ దీపులాయ తిద్దులేనిరూపులాయ
తనియ నీమోవితేనె దక్కెరా నాకు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విదె నన్ను
అనువాయ నిఁకనేమీ నాడకురా నన్నును

(||pallavi||)
nāgĕ sadamainappuḍu nammem̐gāni
sīgāgu kŏnagora simmagurā nannunu

(||nāgĕ ||)
vaḍam̐gaṁḍlaguḽlāya vānaleni jaḽlāya
vŏḍam̐bāḍu lim̐kanenala vobarā nenu
muḍilenivalalāya mūm̐gagannagalalāya
yĕḍanĕḍa nībŏṁdu; lem̐pagurā nannunu

(||nāgĕ||)
yĕṁḍamāvinīḽlāya yĕduḍi gukkiḽlāya
saṁḍido nīvinayālu sālurā nem̐ḍu
vaṁḍa vaṁḍanaṭlāya vāvigāvi vŏṭlāya
aṁḍane mŏkkulu mŏkke aṁṭagurā nannunu

(||nāgĕ||)
tinam̐dinam̐ dībulāya tiddulenirūbulāya
taniya nīmovidenĕ dakkĕrā nāgu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi vidĕ nannu
anuvāya nim̐kanemī nāḍagurā nannunu