Naadonela penamgevu nannemtodambarasevu

నాతోనేల పెనఁగేవు నన్నెంతొడఁబరచేవు
Language

(॥పల్లవి॥)
నాతోనేల పెనఁగేవు నన్నెంతొడఁబరచేవు
ఆతని చిత్త మెట్టిదో అడుగఁగరాదా

(॥నాతో॥)
పన్ని సరసమాడితే పై కొంటగాక వూరకే
సన్నలు సేయఁగఁబోతే సమ్మతులౌనా
కన్నులెదుట నున్నాఁడు కదియఁగా వద్దనేనా
చిన్నదాన నేమీఁ జేయ సిగ్గయ్యీ నాకును

(॥నాతో॥)
మలసి మాఁటాడితేను మచ్చిక చూపుటగాక
పిలిచి కొసరఁబోతే ప్రియములౌనా
కొలువులో విడెమిచ్చె గుట్టుసేయ నిఁకనేల
తెలిపి చెప్పెదనంటే తేనెగారీ మోవిని

(॥నాతో॥)
గక్కనఁ దా నవ్వితేను కాఁగిలించుకొంటఁగాక
ఇక్కువలే యంటఁబోతే నితవులౌనా
అక్కరై శ్రీ వేంకటేశుఁ డంతలోఁ దా నన్నుఁ గూడె
చెక్కునొక్కి వేఁడుకోవే చిమ్మిరేఁగీ మనసు

(||pallavi||)
nādonela pĕnam̐gevu nannĕṁtŏḍam̐barasevu
ādani sitta mĕṭṭido aḍugam̐garādā

(||nādo||)
panni sarasamāḍide pai kŏṁṭagāga vūrage
sannalu seyam̐gam̐bode sammadulaunā
kannulĕduḍa nunnām̐ḍu kadiyam̐gā vaddanenā
sinnadāna nemīm̐ jeya siggayyī nāgunu

(||nādo||)
malasi mām̐ṭāḍidenu machchiga sūbuḍagāga
pilisi kŏsaram̐bode priyamulaunā
kŏluvulo viḍĕmichchĕ guṭṭuseya nim̐kanela
tĕlibi sĕppĕdanaṁṭe tenĕgārī movini

(||nādo||)
gakkanam̐ dā navvidenu kām̐giliṁchugŏṁṭam̐gāga
ikkuvale yaṁṭam̐bode nidavulaunā
akkarai śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalom̐ dā nannum̐ gūḍĕ
sĕkkunŏkki vem̐ḍugove simmirem̐gī manasu