నాతో నేమిచెప్పేవు నంటున నియ్యాల నేను
(॥పల్లవి॥)
నాతో నేమిచెప్పేవు నంటున నియ్యాల నేను
చేత నే నీవూడిగాలు సేసేఁగాక
(॥నాతో॥)
వేడుకతో నిమ్మపంట వేయఁగ వద్దనేనా
యీడ నట్టే కానుకగా నిచ్చేఁగాక
జాడతోఁ బన్నీరు నాపైఁ జల్లితే నిన్నే మనేను
తోడనే నీవచ్చడానఁ దుడిచేఁగాక
(॥నాతో॥)
కోమ్మలవిరులు నాపైఁ గులుకఁగా వద్దనేనా
ముమ్మడిగా నీకొప్పున ముడిచేఁగాక
యెమ్మెలఁ గేళాకూళిలో నీఁదించితే నందుకేమి
ఇమ్ముకొని నీబుజ మేక్కేఁగాక
(॥నాతో॥)
చన్నులు నీ వంటఁగాను జడిపి నే వద్దనేనా
వున్నతి నీవురమున నొత్తేఁగాక
యిన్నిటా శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మన్నించితే మంచిదాయ మరిగేఁగాక
(||pallavi||)
nādo nemisĕppevu naṁṭuna niyyāla nenu
seda ne nīvūḍigālu sesem̐gāga
(||nādo||)
veḍugado nimmabaṁṭa veyam̐ga vaddanenā
yīḍa naṭṭe kānugagā nichchem̐gāga
jāḍadom̐ bannīru nābaim̐ jallide ninne manenu
toḍane nīvachchaḍānam̐ duḍisem̐gāga
(||nādo||)
kommalavirulu nābaim̐ gulugam̐gā vaddanenā
mummaḍigā nīgŏppuna muḍisem̐gāga
yĕmmĕlam̐ geḽāgūḽilo nīm̐diṁchide naṁdugemi
immugŏni nībuja mekkem̐gāga
(||nādo||)
sannulu nī vaṁṭam̐gānu jaḍibi ne vaddanenā
vunnadi nīvuramuna nŏttem̐gāga
yinniḍā śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
manniṁchide maṁchidāya marigem̐gāga