నాతో నేమి చెప్పేవు నమ్మించిన విభుఁడవు
(॥పల్లవి॥)
నాతో నేమి చెప్పేవు నమ్మించిన విభుఁడవు
చేతికి లోనయి పంపుసేయవలెఁ గాక
(॥నాతో॥)
చలముగల మగువ సాదించకేల మాను
అలిగినది దిట్టక అదేల మాను
పిలిపించుకొన్న యాపె బిగియక యేల మాను
చెలరేఁగి చనవెల్లాఁ జెల్లింతువుగాక
(॥నాతో॥)
కన్నులు గలిగినాపె కడుఁజూడకేల మాను
అన్నిటా మించిన దాఁగ కదేల మాను
చన్నులుగట్టైనయాపె చలపట్టకేల మాను
యిన్నిటా నాపెకు లోనై యెనతువుగాక
(॥నాతో॥)
కందువఁ గూడినయాపె కరఁగించకేల మాను
అందినాపె గో రంటించి కదేల మాను
ముందె శ్రీవేంకటేశ మొక్కక ఆపేల మాను
విందువలె మోవిచ్చ వెలతువుగాక
(||pallavi||)
nādo nemi sĕppevu nammiṁchina vibhum̐ḍavu
sedigi lonayi paṁpuseyavalĕm̐ gāga
(||nādo||)
salamugala maguva sādiṁchagela mānu
aliginadi diṭṭaga adela mānu
pilibiṁchugŏnna yābĕ bigiyaga yela mānu
sĕlarem̐gi sanavĕllām̐ jĕlliṁtuvugāga
(||nādo||)
kannulu galiginābĕ kaḍum̐jūḍagela mānu
anniḍā miṁchina dām̐ga kadela mānu
sannulugaṭṭainayābĕ salabaṭṭagela mānu
yinniḍā nābĕgu lonai yĕnaduvugāga
(||nādo||)
kaṁduvam̐ gūḍinayābĕ karam̐giṁchagela mānu
aṁdinābĕ go raṁṭiṁchi kadela mānu
muṁdĕ śhrīveṁkaḍeśha mŏkkaga ābela mānu
viṁduvalĕ movichcha vĕladuvugāga