Naa manasemdaamkaam joosinaamde naa vibhumdu taanu

నా మనసెందాఁకాఁ జూచినాఁడే నా విభుఁడు తాను
Language

(॥పల్లవి॥)
నా మనసెందాఁకాఁ జూచినాఁడే నా విభుఁడు తాను
యీమాట గురుతుచెప్పి ఇంటికిఁ బిలువవే

(॥॥)
చెల్లుబడిమాటకు సిగ్గుపడ నేమిటికి
వెల్లవిరైనపనికి వెగటుగాదు
వుల్లము గలసినందు కొడఁబాటు మరివద్దు
యెల్లవారు నెఱిఁగిరి ఇంటికిఁ బిలువవే

(॥॥)
పక్కన నవ్వినమీఁద పంతమాడ నేమిటికి
మొక్కినవెనక గర్వములు దగదు
నిక్కిచూచినప్పుడే నిండుకొనె నడియాస
ఇక్కువలు సరివచ్చె నింటికిఁ బిలువవే

(॥॥)
చుట్టరికమైనయందు చొప్పులె త్తనేమిటికి
నెట్టుకొంటే వలపులో నెరుసేడది
గుట్టుతోడ నన్నిట్టె కూడె శ్రీవేంకటేశుఁడు
యెట్టయెదుటనే వున్నాఁ డింటికిఁ బిలువవే

(||pallavi||)
nā manasĕṁdām̐kām̐ jūsinām̐ḍe nā vibhum̐ḍu tānu
yīmāḍa gurudusĕppi iṁṭigim̐ biluvave

(||||)
sĕllubaḍimāḍagu siggubaḍa nemiḍigi
vĕllavirainabanigi vĕgaḍugādu
vullamu galasinaṁdu kŏḍam̐bāḍu marivaddu
yĕllavāru nĕṟim̐giri iṁṭigim̐ biluvave

(||||)
pakkana navvinamīm̐da paṁtamāḍa nemiḍigi
mŏkkinavĕnaga garvamulu dagadu
nikkisūsinappuḍe niṁḍugŏnĕ naḍiyāsa
ikkuvalu sarivachchĕ niṁṭigim̐ biluvave

(||||)
suṭṭarigamainayaṁdu sŏppulĕ ttanemiḍigi
nĕṭṭugŏṁṭe valabulo nĕruseḍadi
guṭṭudoḍa nanniṭṭĕ kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
yĕṭṭayĕduḍane vunnām̐ ḍiṁṭigim̐ biluvave