Naa maamtalonivaamdavu namminadaananu nenu

నా మాఁటలోనివాఁడవు నమ్మినదానను నేను
Language

(॥పల్లవి॥)
నా మాఁటలోనివాఁడవు నమ్మినదానను నేను
చే ముంచి నా సేవలెల్లాఁ జిత్తగించవయ్యా

(॥నామాఁట॥)
చుట్టపు వరుస నిన్ను సొలసితి నింతేకాక
యెట్టు సేసినా నేరా లెంచేనా నేను
నెట్టుకొన్న వలపుల నీ దిక్కు చూచితిఁగాక
చుట్టి నీ మై గురుతులు సోదించేనా

(॥నామాఁట॥)
మంచితనమున నీ మర్మము లంటితిఁగాక
చంచుల నిన్నుఁ జెనకి సాదించేనా
కొంచక సంతోసాన గొబ్బున నవ్వితిఁగాక
నించి యెగసక్కేలెల్లా నీయందుఁ జేసేనా

(॥నామాఁట॥)
చెలిమికతైనై నీ చెరఁగు వట్టితిఁగాక
బలుములు సేసి నీతోఁ బచారించేనా
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మలసి నన్నేలితివి మాఁట మీరేనా

(||pallavi||)
nā mām̐ṭalonivām̐ḍavu namminadānanu nenu
se muṁchi nā sevalĕllām̐ jittagiṁchavayyā

(||nāmām̐ṭa||)
suṭṭabu varusa ninnu sŏlasidi niṁtegāga
yĕṭṭu sesinā nerā lĕṁchenā nenu
nĕṭṭugŏnna valabula nī dikku sūsidim̐gāga
suṭṭi nī mai gurudulu sodiṁchenā

(||nāmām̐ṭa||)
maṁchidanamuna nī marmamu laṁṭidim̐gāga
saṁchula ninnum̐ jĕnagi sādiṁchenā
kŏṁchaga saṁtosāna gŏbbuna navvidim̐gāga
niṁchi yĕgasakkelĕllā nīyaṁdum̐ jesenā

(||nāmām̐ṭa||)
sĕlimigadainai nī sĕram̐gu vaṭṭidim̐gāga
balumulu sesi nīdom̐ basāriṁchenā
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
malasi nannelidivi mām̐ṭa mīrenā