నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
పల్లవి:
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక!
చరణం 1:
నేను కవిని కాను .. కవిత రాయలేను
శిల్పిని కాను .. నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను .. గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను .. నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో ..ప్రమిదను పెట్టే పూజారిని .. నీ ప్రేమ పూజారిని !!
చరణం 2:
నేను రాముణ్ణి కాను .. విల్లు విరచలేను
కృష్ణుణ్ణి కాను .. నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ణి కానే కాను .. ఇందురుణ్ణి అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు .. చమురును నింపే ఒక పేదను.. నే నిరుపేదను !!
pallavi:
nā jīvida gamanamulo ŏga nāyiga puṭṭiṁdi
nā jīvida gamanamulo ŏga nāyiga puṭṭiṁdi
adi ūhala logamulo kavidalu rāstuṁdi
ā kavida kāvyamai .. kāvyānigi nāyigavai
variṁchi .. tariṁchi .. ūriṁchaga rāve...kāvyanāyiga!
saraṇaṁ 1:
nenu kavini kānu .. kavida rāyalenu
śhilbini kānu .. ninu tīrsididdalenu
sitragāruni kāne kānu .. gāyaguṇṇi asale kānu
emīgāni nenu .. ninu kŏlise pūjārini
nī guṁḍĕla guḍilo ..pramidanu pĕṭṭe pūjārini .. nī prema pūjārini !!
saraṇaṁ 2:
nenu rāmuṇṇi kānu .. villu virasalenu
kṛṣhṇuṇṇi kānu .. ninu ĕttugu polenu
saṁduruṇṇi kāne kānu .. iṁduruṇṇi asale kānu
ĕvarū kāni nenu ninu kŏlise nirubedanu
anurāgabu divvĕlu .. samurunu niṁpe ŏga pedanu.. ne nirubedanu !!