Naa gumde gudilo nuvvu shilavaa devadavaa

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
Work
Year
Language

పల్లవి:

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా
నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా
ఆ..నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
ఆ..నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా

చరణం 1:

నే బిడియపడితే నువ్వు గిలివా చెక్కిలివా
ఆ..నే విరహమైతే నువ్వు రతివా కోరికవా
ఆ..నే పాపనైతే నువ్వు ఒడివా ఊయలవా
ఆ..హా..నే నిదురనైతే నువ్వు కలవా కౌగిళివా
ఆ..నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా

ఆ..హా..నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా

చరణం 2:

నే గగనమైతే వేసవివా వెన్నెలవా
ఆ..నే నదిని అయితే నువ్వు అలవా అలజడివా
ఆ..నే విందునైతే నువ్వు రుచివా ఆకలివా
ఆ..హా..నే భాషనైతే నువ్వు స్వరమా అక్షరమా
ఆ..నే పాటనైతే నువ్వు శృతివా పల్లవివా..నే

నే తోటనైతే ఆమనివా కోయిలవా
నా జంటకొస్తే నువ్వు ఋషివా మదనుడివా
నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా
ఆ..నిను నేను పిలవకుంటే నువ్వు అలగవా అడగవా
ఆ..నను ప్రేమించమంటే తప్పా ఒప్పా

నీలోన ఉంది నేనే కదా - నేనే కదా
నాలోన ఉంది నీవే కదా - నీవే కదా
ఎదలోని వలపే ఎదురెదురు చూసె
వానలాగా ఒడి చేరెలే 3తెల్

pallavi:

nā guṁḍĕ guḍilo nuvvu śhilavā devadavā
nā valabu baḍilo nuvvu guruvā śhiṣhyuḍivā
nā guṁḍĕ guḍilo nuvvu śhilavā devadavā
nā valabu baḍilo nuvvu guruvā śhiṣhyuḍivā
nī kanula ŏḍilo ne kalanā kāḍuganā
ā..nī pĕdavi taḍilo ne muddunā madhurimanā
ā..nī sŏgasu pŏgaḍa ne kavinā kalbananā
nā guṁḍĕ guḍilo nuvvu śhilavā devadavā
nā valabu baḍilo nuvvu guruvā śhiṣhyuḍivā

saraṇaṁ 1:

ne biḍiyabaḍide nuvvu gilivā sĕkkilivā
ā..ne virahamaide nuvvu radivā korigavā
ā..ne pābanaide nuvvu ŏḍivā ūyalavā
ā..hā..ne niduranaide nuvvu kalavā kaugiḽivā
ā..ne hṛdayamaide ūbirivā savvaḍivā

ā..hā..nā guṁḍĕ guḍilo nuvvu śhilavā devadavā
nā valabu baḍilo nuvvu guruvā śhiṣhyuḍivā

saraṇaṁ 2:

ne gaganamaide vesavivā vĕnnĕlavā
ā..ne nadini ayide nuvvu alavā alajaḍivā
ā..ne viṁdunaide nuvvu rusivā āgalivā
ā..hā..ne bhāṣhanaide nuvvu svaramā akṣharamā
ā..ne pāḍanaide nuvvu śhṛtivā pallavivā..ne

ne toḍanaide āmanivā koyilavā
nā jaṁṭagŏste nuvvu ṛṣhivā madanuḍivā
nī ĕduḍa paḍide pilisevā valasevā
ā..ninu nenu pilavaguṁṭe nuvvu alagavā aḍagavā
ā..nanu premiṁchamaṁṭe tappā ŏppā

nīlona uṁdi nene kadā - nene kadā
nālona uṁdi nīve kadā - nīve kadā
ĕdaloni valabe ĕdurĕduru sūsĕ
vānalāgā ŏḍi serĕle 3tĕl