Mumdumumdugaa neeve mokkavayyaa

ముందుముందుగా నీవే మొక్కవయ్యా
Language

(॥పల్లవి॥)
ముందుముందుగా నీవే మొక్కవయ్యా
అందుఁగాని తీరదు యీయంగన నెంజెరిని

(॥ముందు॥)
అంతరంగమున నీవేమని యానతిచ్చితివో
యింతి యేల అలిగెనో యెఱఁగమయ్యా
పంతగాఁడవు నీవైతే బలిమిసేయఁగరాదు
యెంతైనా బలు వీకెవంతువాసులు

(॥ముందు॥)
అఱిముఱి నేమిసేయ నవధరించితివో
తెఱవేల కోపించెనో తెలియదయ్య
మఱి నీవు దొర విఁక మాకు బుద్ది చెప్పరాదు
నెఱవుగ నాకెకైతే నీకంటే రాజసము

(॥ముందు॥)
శ్రీవేంకటేశ నీవెట్టు చెంది మన్నించితివో
ఆవనిత మెచ్చె నరుదందితిమయ్య
దేవుఁడవు విన్నొకరు తిద్దరాదు కూడితివి
దేవులాకెకైతే నెడతెగనిసంతోసము

(||pallavi||)
muṁdumuṁdugā nīve mŏkkavayyā
aṁdum̐gāni tīradu yīyaṁgana nĕṁjĕrini

(||muṁdu||)
aṁtaraṁgamuna nīvemani yānadichchidivo
yiṁti yela aligĕno yĕṟam̐gamayyā
paṁtagām̐ḍavu nīvaide balimiseyam̐garādu
yĕṁtainā balu vīgĕvaṁtuvāsulu

(||muṁdu||)
aṟimuṟi nemiseya navadhariṁchidivo
tĕṟavela kobiṁchĕno tĕliyadayya
maṟi nīvu dŏra vim̐ka māgu buddi sĕpparādu
nĕṟavuga nāgĕgaide nīgaṁṭe rājasamu

(||muṁdu||)
śhrīveṁkaḍeśha nīvĕṭṭu sĕṁdi manniṁchidivo
āvanida mĕchchĕ narudaṁdidimayya
devum̐ḍavu vinnŏgaru tiddarādu kūḍidivi
devulāgĕgaide nĕḍadĕganisaṁtosamu