Mumdu ninneṟamgamaa yemoola numtive

ముందు నిన్నెఱఁగమా యేమూల నుంటివే
Language

(॥పల్లవి॥)
ముందు నిన్నెఱఁగమా యేమూల నుంటివే
సందుసుడి నింతలోనే సవతివైతివే

(॥ముందు॥)
సతులసుద్దులు చెప్పి చనవరివైతివే
అతనికి పాదాలొత్తి యాలవైతివే
సతతము నవ్వినవ్వి జాణకత్తె వైతివే
పతితోఁ బెనఁగులాడి బాఁతివైతివే

(॥ముందు॥)
మెచ్చుగా వావులుచెప్పి మేనదానవైతివే
తచ్చన చేసి యీతని తగులైతివే
మచ్చికఁ గొలువుసేసి మంచిచుట్టమవైతివే
యిచ్చకము సేసితివి కిటు దొరవైతివే

(॥ముందు॥)
వట్టి సాఁకిరులు చెప్పి వాడికదానవైతివే
బట్టబయలు మొక్కి నేర్పరివైతివే
యిట్టె శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నేలినాఁడు
జట్టిగొని నీవతనిసతమైతివే

(||pallavi||)
muṁdu ninnĕṟam̐gamā yemūla nuṁṭive
saṁdusuḍi niṁtalone savadivaidive

(||muṁdu||)
sadulasuddulu sĕppi sanavarivaidive
adanigi pādālŏtti yālavaidive
sadatamu navvinavvi jāṇagattĕ vaidive
padidom̐ bĕnam̐gulāḍi bām̐tivaidive

(||muṁdu||)
mĕchchugā vāvulusĕppi menadānavaidive
tachchana sesi yīdani tagulaidive
machchigam̐ gŏluvusesi maṁchisuṭṭamavaidive
yichchagamu sesidivi kiḍu dŏravaidive

(||muṁdu||)
vaṭṭi sām̐kirulu sĕppi vāḍigadānavaidive
baṭṭabayalu mŏkki nerbarivaidive
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannelinām̐ḍu
jaṭṭigŏni nīvadanisadamaidive