Moosi daampiramulela mumdarigi raamgadave

మూసి దాఁపిరములేల ముందరికి రాఁగదవే
Language

(॥పల్లవి॥)
మూసి దాఁపిరములేల ముందరికి రాఁగదవే
సేసపాల వెంటనే చిమ్మిరేఁగె వలపు

(॥॥)
చిప్పిలుఁ జెమటలివె చెక్కులపై నున్నవి
రెప్పల నిద్దురలు దేరీ నిదివో
ఇప్పు డాతఁడు నిన్నేలె నెఱఁగమా ఇదె నేఁడు
కుప్పలుఁదెప్పలునై గొనకొనె వలపు

(॥॥)
చెలపచెలపనవ్వు సెలవుల వడిసీని
పులకలు మేననెల్లాఁ బొదిగొనెనే
మలసి నీనాయకుఁడు మన్నించుట వినమా
కులుకుఁ జన్నులమీఁద గుదిగొనె వలపు

(॥॥)
మిసమిసనికళలు మించీ నీమోమున నవె
పొసఁగినపొందు నిన్నుఁ బొదిగొన్నది
యెసఁగి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీతఁ డిట్టె
పస నీచిగురుమోవిఁ బాదుకొనె వలపు

(||pallavi||)
mūsi dām̐piramulela muṁdarigi rām̐gadave
sesabāla vĕṁṭane simmirem̐gĕ valabu

(||||)
sippilum̐ jĕmaḍalivĕ sĕkkulabai nunnavi
rĕppala nidduralu derī nidivo
ippu ḍādam̐ḍu ninnelĕ nĕṟam̐gamā idĕ nem̐ḍu
kuppalum̐dĕppalunai gŏnagŏnĕ valabu

(||||)
sĕlabasĕlabanavvu sĕlavula vaḍisīni
pulagalu menanĕllām̐ bŏdigŏnĕne
malasi nīnāyagum̐ḍu manniṁchuḍa vinamā
kulugum̐ jannulamīm̐da gudigŏnĕ valabu

(||||)
misamisanigaḽalu miṁchī nīmomuna navĕ
pŏsam̐ginabŏṁdu ninnum̐ bŏdigŏnnadi
yĕsam̐gi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nīdam̐ ḍiṭṭĕ
pasa nīsigurumovim̐ bādugŏnĕ valabu