మూఁకలో నెదుర(రె)దుర ముంగిట నుంటిననవే
(॥పల్లవి॥)
మూఁకలో నెదుర(రె)దుర ముంగిట నుంటిననవే
యేఁకటతో మాయింటియిక్కు విదే యనవే
(॥మూఁక॥)
జమళి నా చూపులు చాఁచినదియే గుఱుతు
రమణుని నిక్కడికి రమ్మనవే
కొమరెచన్నులు తన కొలువు సే సే నపుడే
తమితోడ మఱవక తలఁచుకొమ్మనవే
(॥మూఁక॥)
మారుకొని తనతో నే మాఁటాడినదే గుఱుతు
చేరి నాతోడుత పొందుసేయమనవే
వూరెడి తేనెల మోవి వుపారమాయ నప్పుడే
తారుకణౌనో కాదో తలఁచు కొమ్మనవే
(॥మూఁక॥)
కొప్పు వీడఁగా నేను కొంగు వట్టుటే గుఱుతు
చిప్పిల మన్నించి దయసేయు మనవే
యిప్పుడే శ్రీ వేంకటేశుఁ డేడనుండో వచ్చి కూడె
తప్పక యీ భావము తలఁచుకొమ్మనవే
(||pallavi||)
mūm̐kalo nĕdura(rĕ)dura muṁgiḍa nuṁṭinanave
yem̐kaḍado māyiṁṭiyikku vide yanave
(||mūm̐ka||)
jamaḽi nā sūbulu sām̐sinadiye guṟudu
ramaṇuni nikkaḍigi rammanave
kŏmarĕsannulu tana kŏluvu se se nabuḍe
tamidoḍa maṟavaga talam̐sugŏmmanave
(||mūm̐ka||)
mārugŏni tanado ne mām̐ṭāḍinade guṟudu
seri nādoḍuda pŏṁduseyamanave
vūrĕḍi tenĕla movi vubāramāya nappuḍe
tārugaṇauno kādo talam̐su kŏmmanave
(||mūm̐ka||)
kŏppu vīḍam̐gā nenu kŏṁgu vaṭṭuḍe guṟudu
sippila manniṁchi dayaseyu manave
yippuḍe śhrī veṁkaḍeśhum̐ ḍeḍanuṁḍo vachchi kūḍĕ
tappaga yī bhāvamu talam̐sugŏmmanave