Moolanunnavaarinela mumgida vesevu; ninnu

మూలనున్నవారినేల ముంగిట వేసేవు; నిన్ను
Language

(॥పల్లవి॥)
మూలనున్నవారినేల ముంగిట వేసేవు; నిన్ను
తాలిమితోఁ దడవితే తడవరాదా

(॥మూల॥)
శిరసువంచినయోపెఁ జెనకేవు సారె సారె
వరుస నీతో నవ్వవచ్చెనానేఁడు
మరిగి నుండఁగా మరికొంగువట్టేవు
అరుదుగ సరసములాడవచ్చెనా

(॥మూల॥)
పంతముతోనున్న యోపెఁ బలికించవచ్చేవు
వంతులకు ముచ్చటాడవచ్చెనా నీతో
చింతతోడ నుండఁగాను చెక్కులునొక్కేవునీవు
కాంత నీతోఁ బెరఁగఁగవచ్చెనా

(॥మూల॥)
ఆకుమడిచియ్యఁగానట్టె కాఁగిలించితివి
యీకడ మందెమేళాన కిటు వచ్చెనా
చేకొని మన్నించితివిశ్రీవేంకటేశ్వర
దాకొని నిన్నిందాఁకాఁ దమకించవచ్చెనా

(||pallavi||)
mūlanunnavārinela muṁgiḍa vesevu; ninnu
tālimidom̐ daḍavide taḍavarādā

(||mūla||)
śhirasuvaṁchinayobĕm̐ jĕnagevu sārĕ sārĕ
varusa nīdo navvavachchĕnānem̐ḍu
marigi nuṁḍam̐gā marigŏṁguvaṭṭevu
aruduga sarasamulāḍavachchĕnā

(||mūla||)
paṁtamudonunna yobĕm̐ baligiṁchavachchevu
vaṁtulagu muchchaḍāḍavachchĕnā nīdo
siṁtadoḍa nuṁḍam̐gānu sĕkkulunŏkkevunīvu
kāṁta nīdom̐ bĕram̐gam̐gavachchĕnā

(||mūla||)
āgumaḍisiyyam̐gānaṭṭĕ kām̐giliṁchidivi
yīgaḍa maṁdĕmeḽāna kiḍu vachchĕnā
segŏni manniṁchidiviśhrīveṁkaḍeśhvara
dāgŏni ninniṁdām̐kām̐ damagiṁchavachchĕnā