మూలనున్నవారి నీవు ముంగిట వేసేవుగాక
(॥పల్లవి॥)
మూలనున్నవారి నీవు ముంగిట వేసేవుగాక
గోలవై యూరకుండితే కొంగువట్టేనా
(॥మూల॥)
పిలువఁగాబో నీతోఁ బ్రేమమున నూఁకొంటి
అలిగినట్టే వుంటే నదేమనేనా
నిలిచి చూడఁగఁబో నే నిన్నుఁ జూచితిని
తలవంచుకొని యుంటేఁ దడవఁబోయేనా
(॥మూల॥)
చెనకఁగాఁబో నేఁ జేబలిమి చూపితిని
కొనగొనలనే వుంటే గోరఁ దీసేనా
మనసిచ్చి నవ్వఁగాఁబో మారుకొని నవ్వితిని
వెనకటివలె నుంటే వేగిరించేనా
(॥మూల॥)
పైనొరఁగఁగానే పో పంతానకే కూడితిని
మాని నీ వూరకుండితే మాయసేసేనా
యీనెపాన శ్రీవేంకటేశ నన్ను నేలితివి
నేనే నీవైనమీఁద నేరమెంచేనా
(||pallavi||)
mūlanunnavāri nīvu muṁgiḍa vesevugāga
golavai yūraguṁḍide kŏṁguvaṭṭenā
(||mūla||)
piluvam̐gābo nīdom̐ bremamuna nūm̐kŏṁṭi
aliginaṭṭe vuṁṭe nademanenā
nilisi sūḍam̐gam̐bo ne ninnum̐ jūsidini
talavaṁchugŏni yuṁṭem̐ daḍavam̐boyenā
(||mūla||)
sĕnagam̐gām̐bo nem̐ jebalimi sūbidini
kŏnagŏnalane vuṁṭe goram̐ dīsenā
manasichchi navvam̐gām̐bo mārugŏni navvidini
vĕnagaḍivalĕ nuṁṭe vegiriṁchenā
(||mūla||)
painŏram̐gam̐gāne po paṁtānage kūḍidini
māni nī vūraguṁḍide māyasesenā
yīnĕbāna śhrīveṁkaḍeśha nannu nelidivi
nene nīvainamīm̐da neramĕṁchenā