Momu soosidim ganaga mokkidi nimte

మోము చూచితిఁ గనక మొక్కితి నింతే
Language

(॥పల్లవి॥)
మోము చూచితిఁ గనక మొక్కితి నింతే
సాములు సేయకువయ్య చాటిచెప్పే నీకు

(॥మోము॥)
నిన్ను నేల తడవేను నీవాపెవద్దనుండఁగా
వన్నె నీమాఁటప్పగించ వచ్చితిఁగాక
సన్నలెల సేసేవు సారెకునేల లోఁగేవు
పన్ని వెఱవకువయ్య బాసయిచ్చే నీకు

(॥మోము॥)
అందుకే యేల నవ్వే నాపె నీ చెక్కు నొక్కఁగా
చెందిన నీవోజ సంతసించితిఁగాక
కిందుపడనేమిటికి గేలిసేయఁ గలంగకు
పందెము వేసినట్టె బాస ఇచ్చే నీకు

(॥మోము॥)
కయ్యానకేల వచ్చేను కాంత నీ సొమ్మయి వుండఁగా
వొయ్యనే కాఁగిలి నీ కొప్పించేఁగాక
ఇయ్యెడ శ్రీ వేంకటేశ ఇద్దరముఁగూడితిమి
పయ్యెది నీపైఁ గప్పి బాసయిచ్చే నీకు

(||pallavi||)
momu sūsidim̐ ganaga mŏkkidi niṁte
sāmulu seyaguvayya sāḍisĕppe nīgu

(||momu||)
ninnu nela taḍavenu nīvābĕvaddanuṁḍam̐gā
vannĕ nīmām̐ṭappagiṁcha vachchidim̐gāga
sannalĕla sesevu sārĕgunela lom̐gevu
panni vĕṟavaguvayya bāsayichche nīgu

(||momu||)
aṁduge yela navve nābĕ nī sĕkku nŏkkam̐gā
sĕṁdina nīvoja saṁtasiṁchidim̐gāga
kiṁdubaḍanemiḍigi geliseyam̐ galaṁgagu
paṁdĕmu vesinaṭṭĕ bāsa ichche nīgu

(||momu||)
kayyānagela vachchenu kāṁta nī sŏmmayi vuṁḍam̐gā
vŏyyane kām̐gili nī kŏppiṁchem̐gāga
iyyĕḍa śhrī veṁkaḍeśha iddaramum̐gūḍidimi
payyĕdi nībaim̐ gappi bāsayichche nīgu