Mokkemu neegunu mumdumumdugaa nemu

మొక్కేము నీకును ముందుముందుగా నేము
Language

(॥పల్లవి॥)
మొక్కేము నీకును ముందుముందుగా నేము
మక్కువసేసి ఇట్టె మన్నించవయ్యా

(॥మొక్కే॥)
తలఁచి నీవే నన్ను దయఁజూచుటగాక
కొలఁదిమీరి యెందాఁకఁ గొసరేను
చలము సాదించేనంటే సతులము నే మెదురా
మలసి ఇంతటనైన మన్నించవయ్యా

(॥మొక్కే॥)
పనివడి నీవే నాపై బత్తిసేయుటగాక
కొనగొనల నెందాఁకాఁ గొసరేను
మనసు సోదించేనంటే మంకులము నే మెంత
మనసిచ్చి యిపుడైనా మన్నించవయ్యా

(॥మొక్కే॥)
గరిమల నీవే నన్నుఁ గలసి మెచ్చుటగాక
కురులంటి యెందాఁకఁ గొసరేను
యిరవై శ్రీవేంకటేశ యేలితి విల్లాల నేను
మరగి యింతటనైనా మన్నించవయ్యా

(||pallavi||)
mŏkkemu nīgunu muṁdumuṁdugā nemu
makkuvasesi iṭṭĕ manniṁchavayyā

(||mŏkke||)
talam̐si nīve nannu dayam̐jūsuḍagāga
kŏlam̐dimīri yĕṁdām̐kam̐ gŏsarenu
salamu sādiṁchenaṁṭe sadulamu ne mĕdurā
malasi iṁtaḍanaina manniṁchavayyā

(||mŏkke||)
panivaḍi nīve nābai battiseyuḍagāga
kŏnagŏnala nĕṁdām̐kām̐ gŏsarenu
manasu sodiṁchenaṁṭe maṁkulamu ne mĕṁta
manasichchi yibuḍainā manniṁchavayyā

(||mŏkke||)
garimala nīve nannum̐ galasi mĕchchuḍagāga
kurulaṁṭi yĕṁdām̐kam̐ gŏsarenu
yiravai śhrīveṁkaḍeśha yelidi villāla nenu
maragi yiṁtaḍanainā manniṁchavayyā